బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం ఎలిమినేషన్ ప్రక్రియ అనేది చాలా నాటకీయంగా అయ్యింది. బిగ్ బాస్ ఎప్పుడూ కూడా ఎలిమినేషన్ ప్రక్రియన హౌస్ మేట్స్ ఆవారం ఆడిన టాస్క్ ల ప్రోపర్టీస్ రూపంలో ఇచ్చి ప్లాన్ చేస్తుంటాడు. ఇందులో భాగంగా ఫస్ట్ కుండలో మ్యాజిక్ రింగ్ లో బిగ్ బాస్ కన్ను తీసిన శ్రీరామ్ సేఫ్ అయ్యాడు. ఆ తర్వాత నలుగురు డేంజర్ జోన్ లో ఉన్నప్పుడు జెస్సీ సేఫ్ అయ్యాడు. ఇక్కడే కాజల్ తప్పు చేసింది. నలుగురికి నాలుగు బ్యాడ్జెస్ ఇచ్చి వాటిని పుల్ చేసినపుడు అందులో హీరో ఉంటే సేఫ్ అని, విలన్ అని వస్తే అన్ సేఫ్ అని చెప్పాడు కింగ్ నాగార్జున.
ఒక్కొక్కరి పేరు చెప్తూ వారిని పుల్ చేయమని అన్నాడు. కెప్టెన్ అనీమాస్టర్ స్టోర్ రూమ్ నుంచీ బ్యాడ్జెస్ ని తీస్కుని వచ్చి నలుగురుకి ఇచ్చింది. ఫస్ట్ ప్రియాంకని పుల్ చేయమని అడిగారు. ప్రియాంకకి విలన్ వచ్చింది నాట్ సేఫ్ అని చెప్పారు. దీంతో వెంటనే ఉన్న కాజల్ హోస్ట్ నాగార్జున పేరు చెప్పకుండానే బ్యాడ్జ్ ని పుల్ చేసేసింది. నాలుక కరుచుకుంది. వెంటనే నాగార్జున జెస్సీ అంటూ అరిచారు. జెస్సీకి హీరో వచ్చింది. వెంటనే నాగార్జున నెక్ట్స్ కాజల్ తో మాట్లాడుతూ తొందర కదా ఆత్రం ఎక్కువ , మాములుగా అయితే డిస్ క్వాలిఫై చేసి బయటకి పంపాలి అంటూ మాట్లాడారు.
క్లియర్ గా పేరు పిలిచినపుడు తీయాలి అని చెప్పినా కూడా వినిపించుకోదు. అంటూ వార్నింగ్ ఇఛ్చాడు. ఇది కూడా స్ట్రాటజీనా కాజల్ అంటూ ఇంకోసారి ఇలా చేస్తే డిస్ క్వాలిఫై అయిపోతావ్ అంటూ మాట్లాడాడు. కాజల్ కి వార్నింగ్ ఇచ్చాడు కింగ్ నాగార్జున. ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరూ కలిపి కాజల్ కి ఈవారం వరెస్ట్ పెర్ఫామన్స్ కూడా ఇచ్చారు. అదీమేటర్.