‘వార్ 2’ సినిమాను తెలుగులో విడుదల చేసే హక్కులు కొనుగోలు చేసిన యువ నిర్మాత నాగవంశీ తన యుద్ధాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ విజయం సాధించిన నేపథ్యంలో.. తెలంగాణలో కూడా ఏదైనా దారి దొరకకపోతుందా? అదనపు షోలు పట్టేయకపోతానా అని ప్రయత్నాలు సాగిస్తున్నారట. నిన్న సాయంత్రానికి టికెట్ ధరల మీద క్లారిటీ వచ్చేసినా.. ఆయన ఎక్స్‌ట్రా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారట. అర్ధరాత్రి వరకు ఇదే పనిలో ఉన్నారట. దీంతో ఈ రోజు ఎర్లీ వర్కింగ్ అవర్స్‌లో ఏదో ఒకటి తేలేలా ఉంది అని చెబుతున్నారు.
డబ్బింగ్ సినిమా అయినా తెలుగులో మంచి ధరలు పట్టేశాయి ఈ స్వాతంత్ర్య దినోత్సవ రిలీజ్ ఉన్న సినిమాలు. ఇటు ‘కూలీ’ సినిమాకు, అటు ‘వార్ 2’ చిత్రానికి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం చల్లని చూపే చూసింది. అది కరెక్టా? కాదా? ప్రేక్షకుడికి ఎంత లాస్ లాంటివి తర్వాత చూద్దాం. తెలంగాణలో మాత్రం టికెట్ రేట్లు పెంచేది లేదు మ్యాగ్జిమమ్ అని గతంలో చెప్పిన 295 రూపాయలు ఫిక్స్ చేసుకోండి అని తేల్చేశారు. దీంతో ఇన్నాళ్లూ ఓపెన్ చేయకుండా ఆపేసిన ఆడ్వాన్స్ బుకింగ్స్ నిన్న ఓపెన్ అయిపోయాయి.
సినిమాకు ముందు రోజు అంటే 13న రాత్రి ప్రీమియర్ వేద్దామని రిలీజ్ నిర్మాత నాగవంశీ చాలా ప్రయత్నాలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అయితే దీనికి పర్మిషన్లు రాలేదు. తెలంగాణలో అయినా చేద్దామని ఇక్కడ కూడా ప్రయత్నాలు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు అని సమాచారం. వీలైతే అర్ధరాత్రి ప్రీమియర్స్ అయినా వేయించేలా ఏర్పాట్లు చేస్తున్నారట. ఎందుకంటే ఆ షోల మీద అభిమానం అంటే టికెట్ రేటు రెండు, మూడింతలు పెట్టుకోవచ్చు కాబట్టి అని చెప్పొచ్చు.
మరి అలుపెరగని యోధుడు నాగవంశీ ప్రయత్నాలు ఫలిస్తాయా? హిందీ వెర్షన్ తొలి రోజు వసూళ్ల కంటే ఒక్క రూపాయి అయినా ఎక్కువ సాధించాలి అనే ఆయన కోరిక నెరవేరుతుందేమో చూడాలి.