ఇటీవలకాలంలో హీరోల పోలిటికల్ ఎంట్రీ కామన్ అయిపోవడంతో మహేష్ బాబు పేరు కూడా కాస్త గట్టిగానే వినిపించింది. ముఖ్యంగా మహేష్ బాబు ఆల్రెడీ రెండు ఊర్లను దత్తత తీసుకొని ఆ గ్రామాలకి ఉచితంగా అవసరమైనవి అందిస్తుండడం, ఆయన రిలేటివ్ గల్లా జయదేవ్ ఆల్రెడీ రాజకీయాల్లో ఉండడం.. అన్నిటికంటే ముఖ్యంగా త్వరలోనే ఆంధ్రాలో ఎలక్షన్స్ రానుండడంతో మహేష్ బాబు ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొననున్నాడని టాక్ స్ప్రెడ్ అయ్యింది. అలాగని ఏదో ఎమ్మెల్యే, ఎం.పి సీట్ కి పోటీ చేయడం లేదు. కానీ.. గల్లా జయదేవ లేదా తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేయనున్నాడని గుసగుసలు వినిపించాయి.
ఈ విషయమై మహేష్ బాబు ఎలాగూ స్పందించడు కాబట్టి ఆ వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. కానీ.. ఎట్టకేలకు ఆయన సతీమణి నమ్రత ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. తన భర్త మహేష్ బాబుకు రాజకీయాల పట్ల ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదని, ఆయనకు సినిమాలు, కుటుంబం తప్ప మరో వ్యాపకం లేదని చెప్పుకొచ్చింది నమ్రత. దాంతో నిన్నమొన్నటివరకూ ఈ విషయమై నెలకొని ఉన్న కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ అయిపోయింది.