Balakrishna Daughter: బాలయ్య కొడుకుతో పాటు చిన్న కూతురు కూడా సినీ రంగప్రవేశానికి రెడీ..!
- September 3, 2024 / 01:53 PM ISTByFilmy Focus
నందమూరి బాలకృష్ణ (Balakrishna) చిన్న కూతురు నందమూరి తేజస్విని గురించి ఈ మధ్య ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ‘అఖండ’ (Akhanda) నుండి బాలకృష్ణ నటిస్తున్న సినిమాలు అన్నీ ఈమె ఎంపిక చేసినవేనట. బాలయ్య మొహమాటం కొద్దీ.. ఫేడౌట్ డైరెక్టర్లకు ఛాన్స్ లు ఇస్తాను అని మాటిచ్చేస్తూ ఉంటారనే టాక్ ఒకటి ఉంది. ఆ మొహమాటానికి తేజస్విని బ్రేకులు వేసినట్టు ఇన్సైడ్ టాక్ గట్టిగా వినిపించింది. అన్నిటికీ మించి చిన్న కూతురు (Balakrishna Daughter) అంటే బాలకృష్ణకి పంచ ప్రాణాలట.
Balakrishna Daughter:

ఆమె ఏం చెప్పినా బాలయ్య కాదనడు అని, చిన్న కూతురు (Balakrishna Daughter) మాటే బాలయ్య మాట అని ఆయన సన్నిహితులు ఎక్కువగా చెబుతుంటారు. ఇదిలా ఉండగా.. నందమూరి తేజస్విని గురించి మరో ఆసక్తికర వార్త ఒకటి ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. నందమూరి తేజస్విని త్వరలోనే నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతుందట. అది కూడా మోక్షజ్ఞ డెబ్యూ మూవీతో అని సమాచారం. అవును పూర్తి వివరాల్లోకి వెళితే…

నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ డెబ్యూ మూవీ.. సెప్టెంబర్ 6న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. రామకృష్ణ స్టూడియోస్ లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు బాలకృష్ణ. ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందట. ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

ఆయనతో కలిసి నందమూరి తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరించబోతున్నట్టు సమాచారం. ఇక ఈ ప్రాజెక్టులో నందమూరి బాలకృష్ణ కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తారని తెలుస్తుంది. సోసియో ఫాంటసీ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రం ‘ప్రశాంత్ వర్మ (Prasanth Varma) సినిమాటిక్ యూనివర్స్'(పి వి సి యు) లో భాగం అని టాక్.

















