నందమూరి తారకరత్న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బెంగళూరులోని నారాయణ హృదయాలయాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం మనకు తెలిసిందే. గత 20 రోజులుగా ఈయన నారాయణ హృదయాలయాలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు అయితే నేడు ఈయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించడంతో తుది శ్వాస విడిచారు.
నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నటువంటి తారకరత్న ఉన్నఫలంగా స్పృహ తప్పి పడిపోయారు. అయితే అప్పటికే పల్స్ రేట్ పడిపోవడంతో వైద్యులు సిపిఆర్ నిర్వహించి పల్స్ రేట్ వచ్చేలా చేశారు. ఈ క్రమంలోనే అత్యవసర చికిత్స నిమిత్తం ఈయనని బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ విదేశీ నిపుణుల సమక్షంలో ఈయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఇలా ఈయనకు విదేశీ వైద్య నిపుణుల సమక్షంలో చికిత్స జరుగుతున్నప్పటికీ ఈయన గత 23 రోజులుగా స్పృహలోకి రాలేదు అలాగే ఈయన మెదడు పనితీరు కూడా పూర్తిగా క్షీణించడంతో ఈయన మృతి చెందినట్లు తెలుస్తోంది.ఇక ఈయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు నందమూరి కుటుంబం మొత్తాన్ని ఆసుపత్రికి పిలిపించారు. ఇలా ఈరోజు మధ్యాహ్నం నందమూరి కుటుంబ సభ్యులందరూ హుటాహుటిన బెంగళూరుకు చేరుకున్నారు. అయితే కొద్ది నిమిషాల క్రితమే తారకరత్న మృతి చెందినట్లు వైద్యులు తెలియజేశారు.
తారకరత్న మృతదేహాన్ని రేపు మోకిలలోని తన నివాసానికి తరలించనున్నారు. సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఆ ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు మహాప్రస్థానంలో ఈయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?