Nani: నిర్మాతగా నాని కొత్త సినిమా.. మరో కొత్త దర్శకుడు రెడీ.. ఎవరంటే?
- July 17, 2024 / 04:58 PM ISTByFilmy Focus
తను నటించే సినిమాలలోనే కాదు, నిర్మించే సినిమాల విషయంలోనూ నాని (Nani) కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. గత కొన్నేళ్లుగా ఆయన అలానే చేస్తూ ఉన్నారు. తాజాగా మరోసారి ఆయన కొత్త టాలెంట్‌ని పరిచయం చేయబోతున్నారు. తన బ్యానర్ వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్ మీద కొత్త సినిమాను ప్రకటించారు. ఇటీవల ఓ సినిమా ఫంక్షన్‌కు వచ్చిన ఈ మేరకు దర్శకుణ్ని పరిచయం చేశారు. నభా నటేశ్(Nabha Natesh) – ప్రియదర్శి (Priyadarshi) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘డార్లింగ్’ (Darling) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల జరిగింది.
దీనికి ముఖ్య అతిథిగా నాని వచ్చాడు. ఈ క్రమంలో తన బ్యానర్‌లో కొత్త ప్రాజెక్ట్ వివరాలు కూడా చెప్పారు. ఆ సినిమాను ప్రకటించడానికి ఇంత కంటే మంచి సమయం ఉండదు అంటూ.. అక్కడే ఉన్న జగదీశ్‌ను వేదిక పైకి పిలిచి సినిమా అనౌన్స్ చేశాడు. జగదీశ్ అనే పేరు భవిష్యత్తులో ఇండస్ట్రీలో బలంగా వింటారు అంటూ తన మీద ఉన్న నమ్మకాన్ని చెప్పాడు నాని. నాని అంత బలంగా చెబుతున్నాడు అంటే అతనిలో ఏదో గొప్ప విసయం ఉంది అనే అంటున్నారు నెటిజన్లు.

ఎందుంకటే వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ మీద ఇప్పటివరకు వచ్చిన దర్శకులు అలాంటివాళ్లు మరి. ‘ఆ!’ (Awe) సినిమాతో వచ్చిన ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఇప్పుడు పాన్ ఇండియా దర్శకుడు. ‘హను – మాన్’ (Hanu Man) సినిమాతో ఆయన పాన్ ఇండియా దర్శకుడు అయిపోయారు. అయితే అంతకుముందే మంచి కాన్సెప్ట్ కథలతో సినిమాలు చేసి మెప్పించారు. ఇక ‘హిట్’ (HIT: The First Case) సిరీస్ సినిమాలతో హిట్ డైరక్టర్ అయ్యారు శైలేష్ కొలను (Sailesh Kolanu) .

ఆయన నుండి ‘హిట్’, ‘హిట్ 2’ (HIT: The Second Case) వచ్చి మంచి విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు ‘హిట్ 3’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారాయన. ఆ సినిమాలో హీరో నానినే. ఇక ఇప్పుడు జగదీశ్ కూడా ఇలా మంచి కథతో వస్తే ఆయన పేరు ఎక్కువ రోజులు గుర్తుండిపోతుంది. అందుకే నాని ఆ మాట నమ్మకంతో అన్నారు అని చెప్పొచ్చు.















