Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » నాని హీరోగా దానయ్య డి.వి.వి. భారీ చిత్రం ప్రారంభం

నాని హీరోగా దానయ్య డి.వి.వి. భారీ చిత్రం ప్రారంభం

  • November 23, 2016 / 06:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాని హీరోగా దానయ్య డి.వి.వి. భారీ చిత్రం ప్రారంభం

ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్‌, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్‌మేన్‌, మజ్ను వంటి వరస హిట్స్‌తో ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకొని ప్రస్తుతం ‘నేను లోకల్‌’ చిత్రంలో నటిస్తున్న నేచురల్‌స్టార్‌ నాని హీరోగా ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల్ని నిర్మించిన భారీ నిర్మాత దానయ్య డి.వి.వి… శివ నిర్వాణ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి పతాకంపై నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నెం.3 షూటింగ్‌ నవంబర్‌ 23 ఉదయం 9.38 గంటలకు ఫిలింనగర్‌ దైవ సన్నిధానంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రారంభమైంది. నాని, నివేథా థామస్‌, ఆది పినిశెట్టిలపై తీసిన ముహూర్తపు షాట్‌కి సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ క్లాప్‌ కొట్టగా, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. సీనియర్‌ డైరెక్టర్‌ రవిరాజా పినిశెట్టి, ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌, దామోదర ప్రసాద్‌, మైత్రి మూవీస్‌ యలమంచిలి రవిశంకర్‌, దర్శకుడు బి.వి.ఎస్‌.రవి, జెమిని కిరణ్‌, శివలెంక కృష్ణప్రసాద్‌, బెక్కం వేణుగోపాల్‌ తదితరులు ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.

ఈ చిత్రం గురించి నాని మాట్లాడుతూ – ”వరసగా మంచి సినిమాలు చేసే అవకాశం వచ్చిన నాకు ‘నేను లోకల్‌’ తర్వాత ఎలాంటి సినిమా చెయ్యాలా అని ఆలోచిస్తున్న టైమ్‌లో శివ వచ్చి ఈ స్టోరీ చెరప్పగానే ఇలాంటి సినిమానే చెయ్యాలనిపించి ఇమ్మీడియేట్‌గా అంగీకరించాను. ఒక ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌తో ఎంటర్‌టైనింగ్‌గా సాగే ఈ సినిమా టీమ్‌ అంతా నాకు ఇష్టమైన టీమ్‌. శివ, కోన వెంకట్‌, కార్తీక్‌ ఘట్టమనేని, గోపీసుందర్‌, హీరోయిన్‌ నివేథా వీళ్ళందరితో కలిసి చెయ్యడం చాలా హ్యాపీగా వుంది. ఆది పినిశెట్టి నేను కలిసి వర్క్‌ చేస్తున్నాం. నాకు మరో మంచి సినిమా అవుతుంది” అన్నారు.

నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ – ”నానితో ఫస్ట్‌ టైమ్‌ మా బేనర్‌లో చేస్తున్నాం. ఈ చిత్రం 80 శాతం షూటింగ్‌ అమెరికాలో వుంటుంది. చాలా భారీ సినిమా. మిగిలిన షూటింగ్‌ హైదరాబాద్‌, వైజాగ్‌లలో జరుగుతుంది. శివ చెప్పిన కథ నచ్చి కథకు పూర్తి న్యాయం జరిగేలా భారీ ఎత్తున ఈ సినిమా చేస్తున్నాం. డిసెంబర్‌ 5 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి ఏకధాటిగా చేస్తాం” అన్నారు.

ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న యంగ్‌ హీరో ఆది పినిశెట్టి మాట్లాడుతూ – ”మలుపు, సరైనోడు చిత్రాలతో నన్ను బాగా ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్‌. నాని, నేను కలిసి చేస్తున్న ఈ కథ నాకు బాగా నచ్చింది. శివ ఈ సబ్జెక్ట్‌ని చాలా ఇంట్రెస్టింగ్‌గా చెప్పాడు. నా క్యారెక్టర్‌ ఏంటి? అన్నది ముహూర్తం రోజు చెప్పడం కంటే రిలీజ్‌ ముందు చెప్తే బాగుంటుంది. డెఫినెట్‌గా నా కెరీర్‌కి ప్లస్‌ అయ్యే సినిమా ఇది” అన్నారు.

హీరోయిన్‌ నివేథా థామస్‌ మాట్లాడుతూ – ”జెంటిల్‌మన్‌ తర్వాత నానితో మళ్ళీ వర్క్‌ చెయ్యడం ఆనందంగా వుంది. ఈ సబ్జెక్ట్‌, ఈ టీమ్‌ అంతా వండర్‌ఫుల్‌. ఎప్పుడెప్పుడు షూటింగ్‌ చేస్తానా అని చాలా ఎక్సైటింగ్‌గా వున్నాను” అన్నారు.

దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ – ”ఒక సెన్సిబుల్‌ పాయింట్‌ని ఎంటర్‌టైనింగ్‌ వేలో చెప్పే ప్రయత్నం ఇది. నానికి కథ చెప్పగానే వెంటనే ఓకే అన్నారు. కోన వెంకట్‌గారి స్క్రీన్‌ప్లే ఈ కథకు ఇంకా గ్రిప్‌ తెచ్చింది. దానయ్యగారిలాంటి పెద్ద ప్రొడ్యూసర్‌ బేనర్‌లో ఇంత మంచి టీమ్‌తో నా తొలి చిత్రం చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను” అన్నారు.

రచయిత కోన వెంకట్‌ మాట్లాడుతూ – ”నాని, ఆది ఫస్ట్‌ కాంబినేషన్‌, నాని, నివేథా హిట్‌ కాంబినేషన్‌, డైరెక్టర్‌ శివ మంచి టాలెంట్‌, సబ్జెక్ట్‌ చాలా బాగుంటుంది. నాని వరస విజయాల్లో ఇది మరో హిట్‌ మూవీ అవుతుంది. దానయ్య డి.వి.వి. కాంప్రమైజ్‌ అవకుండా ఈ చిత్రాన్ని లావిష్‌గా తీస్తున్నారు” అన్నారు.

నేచురల్‌ స్టార్‌ నాని, నివేథా థామస్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రని ఆది పినిశెట్టి పోషిస్తున్నారు. మురళీశర్మ, తనికెళ్ళ భరణి, పృథ్వీ, రాజశ్రీనాయర్‌, నీతు, భూపాల్‌రాజ్‌, కేదార్‌శంకర్‌, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్‌ నేహంత్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్‌, సంగీతం: గోపీసుందర్‌, ఫోటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని, ఆర్ట్‌: చిన్నా, స్టైలింగ్‌: నీరజ కోన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీజో, కో-డైరెక్టర్‌: లక్ష్మణ్‌ ముసులూరి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సత్యం గుగ్గిల, నిర్మాత: దానయ్య డి.వి.వి., రచన, దర్శకత్వం: శివ నిర్వాణ.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadhi Pinisetty
  • #Actress Nivatha Thomas
  • #Director Koratala Siva
  • #Dvv Danayya
  • #Nani

Also Read

Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Bimbisara Collections: 3 ఏళ్ళ ‘బింబిసార’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Bimbisara Collections: 3 ఏళ్ళ ‘బింబిసార’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Madam Collections: అయ్యో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది

Sir Madam Collections: అయ్యో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది

Mahavatar Narsimha Collections: అక్కడ రూ.100 కొట్టే వరకు ఆగేలా లేదు

Mahavatar Narsimha Collections: అక్కడ రూ.100 కొట్టే వరకు ఆగేలా లేదు

Kingdom Collections: మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Kingdom Collections: మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Sivakarthikeyan, Murugadoss: రూ.200 కోట్లు పెట్టారు.. రిలీజ్ కి ముందే రూ.76 కోట్లు వచ్చాయి.. కానీ?

Sivakarthikeyan, Murugadoss: రూ.200 కోట్లు పెట్టారు.. రిలీజ్ కి ముందే రూ.76 కోట్లు వచ్చాయి.. కానీ?

related news

Mahesh Babu: మహేష్ బాబు ఫ్లాప్ సినిమా గురించి కృష్ణ ఓల్డ్ కామెంట్స్ వైరల్

Mahesh Babu: మహేష్ బాబు ఫ్లాప్ సినిమా గురించి కృష్ణ ఓల్డ్ కామెంట్స్ వైరల్

Kingdom: ‘కింగ్డమ్’ రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్న నాని.. ఎందుకంటే..!

Kingdom: ‘కింగ్డమ్’ రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్న నాని.. ఎందుకంటే..!

Alludu Seenu Collections: డెబ్యూ హీరోల్లో అరుదైన రికార్డ్.. 11 ఏళ్ళ ‘అల్లుడు శీను’ కలెక్షన్స్ ఇవే

Alludu Seenu Collections: డెబ్యూ హీరోల్లో అరుదైన రికార్డ్.. 11 ఏళ్ళ ‘అల్లుడు శీను’ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

Eega Collections: రాజమౌళి ‘ఈగ’ కి 13 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Eega Collections: రాజమౌళి ‘ఈగ’ కి 13 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

trending news

Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Bimbisara Collections: 3 ఏళ్ళ ‘బింబిసార’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Bimbisara Collections: 3 ఏళ్ళ ‘బింబిసార’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Sir Madam Collections: అయ్యో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది

Sir Madam Collections: అయ్యో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది

4 hours ago
Mahavatar Narsimha Collections: అక్కడ రూ.100 కొట్టే వరకు ఆగేలా లేదు

Mahavatar Narsimha Collections: అక్కడ రూ.100 కొట్టే వరకు ఆగేలా లేదు

5 hours ago
Kingdom Collections: మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Kingdom Collections: మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

5 hours ago

latest news

Lokesh Kanagaraj: ఆ ఒక్క సీన్‌కే రెండేళ్లు.. ‘కూలీ’లో స్పెషల్‌ సీన్‌ గురించి చెప్పిన లోకేశ్‌

Lokesh Kanagaraj: ఆ ఒక్క సీన్‌కే రెండేళ్లు.. ‘కూలీ’లో స్పెషల్‌ సీన్‌ గురించి చెప్పిన లోకేశ్‌

6 hours ago
నేషనల్‌ అవార్డు: ఈ గౌరవం అందుకున్న ఐదు తెలుగు పాటలేంటో తెలుసా?

నేషనల్‌ అవార్డు: ఈ గౌరవం అందుకున్న ఐదు తెలుగు పాటలేంటో తెలుసా?

10 hours ago
చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌‌పై ప్రొడక్షన్ నెంబర్ 3గా వేణు దోనేపూడి నిర్మాతగా కొత్త చిత్రం ప్రారంభం

చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌‌పై ప్రొడక్షన్ నెంబర్ 3గా వేణు దోనేపూడి నిర్మాతగా కొత్త చిత్రం ప్రారంభం

10 hours ago
Ustaad Bhagat Singh: పవన్‌ కల్యాణ్‌ పని అయిపోయింది.. నెక్స్ట్‌ ఏంటి హరీశ్‌?

Ustaad Bhagat Singh: పవన్‌ కల్యాణ్‌ పని అయిపోయింది.. నెక్స్ట్‌ ఏంటి హరీశ్‌?

11 hours ago
Kingdom: విజయ్ దేవరకొండకి రూ.30 కోట్లు.. అనిరుధ్ కి రూ.10 కోట్లు..’కింగ్‌డమ్’ పారితోషికాల లెక్కలు

Kingdom: విజయ్ దేవరకొండకి రూ.30 కోట్లు.. అనిరుధ్ కి రూ.10 కోట్లు..’కింగ్‌డమ్’ పారితోషికాల లెక్కలు

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version