Shyam Singha Roy Teaser: న్యాచురల్ స్టార్ ఖాతాలో బ్లాక్ బస్టర్ చేరినట్టే!

ఈ మధ్య కాలంలో న్యాచురల్ స్టార్ నాని నటించిన సినిమాలు ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరుత్సాహపరుస్తున్నాయనే సంగతి తెలిసిందే. నాని గత సినిమా టక్ జగదీష్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. నాని హీరోగా సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ టీజర్ తాజాగా రిలీజ్ కాగా ఈ టీజర్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచింది. క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ నెల 24వ తేదీన థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

“స్త్రీ ఎవ్వరికీ దాసి కాదు.. ఆఖరికి దేవుడికి కూడా.. ఖబడ్దార్” అంటూ నాని టీజర్ లో చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్యామ్ సింగరాయ్ సినిమా కోసం నాని తన లుక్ ను పూర్తిగా మార్చుకున్నారని టీజర్ ను చూస్తే అర్థమవుతోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. కృతిశెట్టితో నాని లిప్ కిస్ టీజర్ కు హైలెట్ గా నిలిచింది.

నాని టీజర్ లో రెండు లుక్స్ లో కనిపించగా నాని భిన్నమైన కథతో ఈసారి సక్సెస్ సాధించేలా ఉన్నారు. వెంకట్ బోయినపల్లి 50 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. లవ్ స్టోరీ తర్వాత రిలీజవుతున్న సాయిపల్లవి మూవీ ఇదే కావడంతో సాయిపల్లవి ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. టీజర్ లో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుండటంతో పాటు టీజర్ కొత్తగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!


ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Share.