టాలీవుడ్ ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నాని ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అయితే నాని ఎక్కువగా యంగ్ డైరెక్టర్లతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతారు అలాగే కొత్త దర్శకులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు.ఇలా ఇప్పటికే ఎంతో మంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత నానికి దక్కుతుందని చెప్పాలి.
ఇక తాజాగా ఈయన హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాకి కూడా కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు ఇక ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ముందుగానే ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక పాట విడుదల కాక తాజాగా మరొక పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లోని బిట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా స్టూడెంట్స్ అడిగే ప్రశ్నలకు (Nani) నాని సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే ఒక స్టూడెంట్ నానిని ప్రశ్నిస్తూ మీరు ఎప్పుడు కూడా ఎందుకు కొత్త దర్శకులతోనూ అలాగే యంగ్ డైరెక్టర్లతోనే పనిచేస్తారు. ఎందుకు పెద్ద దర్శకులతో సినిమాలు చేయరు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు నాని కూడా తన స్టైల్ లోనే సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ మీరు అనుకుంటే చాలా పెద్ద హీరోల సినిమాలను చూడవచ్చు అంతవరకు కూడా సినిమాలు చూడకుండా ఆగవచ్చు.
ఇలా పెద్ద హీరోల సినిమాలు మాత్రమే కాకుండా నా సినిమాలు కూడా ఎందుకు చూస్తున్నారు అంటూ ఈయన తిరిగి ప్రశ్నించారు. మనం మనసుకు నచ్చిన పనులను చేసుకుంటూ పోతున్నాం మనసుకు నచ్చిన సినిమాలను చూస్తున్నాం అలాగే నేను కూడా అంతే అంటూ ఈ సందర్భంగా నాని చెప్పినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో నానికి జోడిగా నటి మృణాల్ ఠాకూర్ నటించిన సంగతి తెలిసిందే.