నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా తన మార్క్ చూపిస్తూ.. మరోపక్క నిర్మాతగా కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వాల్ పోస్టర్ సినిమాస్ అనే తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ తన అభిరుచిని చాటారు. ‘అ!’ (Awe), ‘హిట్’ (HIT) సిరీస్ నుంచి ‘కోర్ట్’ (Court) వరకూ వాల్ పోస్టర్ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు నాణ్యతతో నిలిచాయి. ఇదిలా ఉండగా.. తాజాగా నాని మరో కొత్త బ్యానర్‌ను ప్రారంభించారు. దానికి ‘యునానిమస్’ అనే పేరు పెట్టారు.
వాల్ పోస్టర్ సినిమాస్, యునానిమస్.. ఈ రెండు బ్యానర్ల మధ్య తేడాను నాని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్లియర్ చేశారు. వాల్ పోస్టర్ సినిమా కొత్త టాలెంట్‌కు, ఫ్రెష్ కథలకు డెడికేటెడ్ బ్యానర్ అని.. అక్కడ స్టార్ హీరోల సినిమాలు ఉండవని స్పష్టంగా చెప్పారు. కానీ యునానిమస్ బ్యానర్ మాత్రం స్టార్ హీరోల సినిమాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేశానని చెప్పారు. రాబోయే చిరంజీవి సినిమా కూడా యునానిమస్ బ్యానర్‌పై వస్తుందని వెల్లడించారు.
ఈ డిఫరెన్షన్ నాని దృష్టిని తెలియజేస్తోంది. ఒకవైపు కొత్తవారికి ప్లాట్‌ఫాం ఇచ్చే ప్రయత్నం చేస్తూనే.. మరోవైపు కమర్షియల్ లెవెల్‌లో స్టార్ ప్రాజెక్ట్స్‌ను కూడా క్యారీ చేయాలని డిజైన్ చేసుకున్నారు. నిర్మాతగా నాని తీసుకున్న ఈ నిర్ణయం సినీ వర్గాల్లో ప్రశంసలందుకుంటోంది. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడమే కాకుండా.. మార్కెట్‌లో తన స్థాయిని కూడా పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం నాని హిట్ 3 (HIT 3) మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. మే 1న విడుదల కానున్న ఈ సినిమా నానీ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవబోతోందని టాక్.
ఈ సినిమా తర్వాత నాని శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో ‘ప్యారడైజ్’ (The Paradise) అనే కొత్త ప్రాజెక్ట్‌లో నటించబోతున్నారు. దసరా సినిమాతో వచ్చిన విజయాన్ని కొనసాగించేలా మళ్లీ శ్రీకాంత్-నాని కాంబినేషన్ భారీ అంచనాలు పెంచుతోంది. నాని సినిమాలపై ఎప్పుడూ ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తన ప్రమోషన్ స్టైల్‌తో మరో లెవెల్‌లో సినిమాకు హైప్ క్రియేట్ చేయగలడని నిరూపించారు. హిట్ 3 విజయంతో నాని నిర్మాణ రంగం, హీరోగా కెరీర్ రెండూ మరో లెవెల్ కు వెళ్లే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.