విక్టరీ వెంకటేష్ 75 వ సినిమాగా ‘సైంధవ్’ రూపొందింది. వెంకటేష్ ల్యాండ్ మార్క్ మూవీ కాబట్టి.. నిర్మాత వెంకట్ బోయినపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వెంకటేష్ 75 కి తగ్గట్టు 75 కోట్ల వరకు ఈ సినిమాకి ఆయన బడ్జెట్ పెట్టినట్టు సమాచారం. అయితే ఈ బడ్జెట్ లో ఎక్కువ శాతం పారితోషికాలకే పోయింది అని ఇన్సైడ్ టాక్. వెంకటేష్ తీసుకుంది రూ.10 నుండి రూ.12 కోట్లు మాత్రమే అని టాక్.
అయితే ఈ సినిమాలో విలన్ గా చేసిన నవాజుద్దీన్ సిద్దిఖీకి (Nawazuddin Siddiqui) ఏకంగా రూ.8 కోట్లు పారితోషికం చెల్లించారట. అంటే దగ్గర.. దగ్గరలో హీరోకి సమానంగానే అన్నట్టు. ఇక ఆర్యకి రూ.4 కోట్ల వరకు చెల్లించినట్టు టాక్. ‘సైంధవ్’ ని తమిళ, హిందీలో భాషల్లో రిలీజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఇలా పెద్ద రేంజ్లో పారితోషికాలు ఇచ్చి ఉండొచ్చు. కానీ హీరోకి దగ్గర్లో విలన్ నవాజుద్దీన్ పారితోషికం ఉండటం అందరికీ షాకిస్తుంది.
వాస్తవానికి ఈ సినిమాలో అతనిది చెప్పుకోదగ్గ పాత్ర అయితే కాదు. కానీ ఉన్నంతలో తన వంతు బెస్ట్ ఇచ్చాడు. నవాజుద్దీన్ కి తెలుగు ఎలాగూ రాదు.. అది పక్కన పెడితే ఇతనికి ఇంగ్లీష్ కూడా రాదు. పరభాషా నటీనటులకు సీన్ వివరించాలి అంటే ఇంగ్లీష్ నే మనవాళ్ళు వాడుకునే వారు. కానీ నవాజుద్దీన్ కి అది కూడా రాదు. అందుకే తెలుగు సినిమాలకి అతను ఓకే చెప్పడం లేదు. మొత్తానికి ‘సైంధవ్’ కి ఓకే చెబితే.. దాని ఫలితం ఇలా ఉంది.