నీరజ భనొత్.. సెప్టెంబర్ 5, 1986..పాకిస్థాన్ లోని కరాచిలో పాన్ అమెరికన్ ఎయిర్వేస్ కి చెందిన విమానం హైజాక్ కు గురైనప్పుడు 359 ప్రయాణికుల ప్రాణాలను కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలు కోల్పోయింది. 23 ఏళ్ళ నీరజ..ఉగ్రవాదుల కుట్రకు బలై..చిన్న వయస్సులోనే అశోఖ చక్ర అవార్డును సొంతం చేసుకుంది. ఆమె జీవిత ఆధారంగా బాలివుడ్ దర్శకుడు రామ్ మాధవాని ‘నీరజ’ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో సోనం కపూర్ నీరజ పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే..ఈ చిత్ర మ్యూజిక్ ఆల్బం కు మంచి టాక్ వచ్చింది. ‘ఆంఖే మిలాఏంగే డర్’ అనే పాట ఏషియన్ బెస్ట్ వీడియోస్ లో ఆరో స్థానం దక్కించుకుంది.
తాజాగా నీరజ భనొత్ అనౌన్స్-మెంట్ లోని ఒరిజినల్ వాయిస్ ను చిత్ర బృందం విడుదల చేసింది. అయితే..ఈ వాయిస్ ఘటన జరిగినప్పుడా లేదా అనే విషయం వెల్లడించలేదు. ప్రాణత్యాగం చేసి కోట్ల ప్రజల గుండెల్లో శాశ్వతంగా స్థానం సంపాదించిన నీరజ..పాత్ర పోషించడం గర్వంగా ఉందని సోనం కపూర్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. నీరజ వాయిస్ ను విడుదల చేస్తూ..ఇది సాధారణ అనౌన్స్-మెంట్ కాదని, ‘వాయిస్ ఆఫ్ కరేజ్’ అని చెప్పడమే సబబని సోనం కపూర్ పేర్కొంది. నిన్న విడుదలైన ఈ వాయిస్ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇక ఫిబ్రవరి 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.