Baladitya: అతి మంచితనం పనికిరాదు అంటున్న నెటిజన్స్..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లోకి బాలాదిత్య హాట్ ఫేవరెట్ గా అడుగుపెట్టాడు. అనుకున్నట్లుగానే ఫస్ట్ డేనే హౌస్ మేట్స్ ఓటింగ్ తో క్లాస్ టీమ్ లోకి వెళ్లాడు. కానీ, ప్రస్తుతం ట్రాష్ టీమ్ లో ఇబ్బంది పడుతున్నాడు. ఇక్కడే బాలాదిత్య రెండు సార్లు ఆపర్చునిటీని కోల్పోయాడు. తన అతి మంచితనం వల్లే ఇలా అయ్యిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే.., బాలాదిత్యని ఫస్ట్ రౌండ్ లో హౌస్ మేట్స్ అందరూ క్లాస్ టీమ్ అని డిసైడ్ చేశారు.

క్లాస్ టీమ్ లో ఉన్న బాలాదిత్య టాస్క్ ఆడినా లేదా స్వాప్ అయినా కూడా మహా అయితే మాస్ టీమ్ లోకి రావాలి. కానీ, అనూహ్యంగా గీతుతో స్వాప్ అవ్వడం వల్ల నేరుగా ట్రాష్ టీమ్ లోకి వచ్చి పడ్డాడు. దీంతో నామినేషన్స్ ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. రెండు సార్లు టాస్క్ ఆడే ఆపర్చునిటీ వచ్చినా కూడా దాన్ని కూడా మిస్ చేసుకుని వేరేవాళ్లకి ఆడే అవకాశం ఇచ్చాడు బాలాదిత్య.

ఫస్ట్ స్లైడర్ గేమ్ లో రేవంత్ ని పంపించాడు. ఇక్కడ రేవంత్ కి ఎప్పట్నుంచో అవకాశం రాలేదు కాబట్టే సరే, కానీ అస్సలు ఆర్గ్యూమెంట్ లేకుండానే మంచితనంతో శాక్రిఫైజ్ చేయడం కరెక్ట్ కాదంటున్నారు నెటిజన్స్. మరో సారి రోల్ బేబీ రోల్ గేమ్ లో కూడా ఇనయా సుల్తానాకి అవకాశం ఇచ్చాడు. అంతేకాదు, గేమ్ ఆడేటపుడు అడ్డొచ్చారని నిందవేసినా కూడా మంచితనంతో చిరునవ్వుతో యాక్సెప్ట్ చేశాడు. ఇవన్నీ చూసినవాళ్లు అసలు క్లాస్ టీమ్ నుంచీ ట్రాష్ టీమ్ కి రావడమే తప్పని, డిబేట్ లేకుండా ఎలా అంగీకరించాడని అంటున్నారు.

అంతేకాదు, ఒకసారి టాస్క్ ఆడి ఓడిపోయినా ఇనయా సుల్తానాని మరోసారి టాస్క్ లోకి ఎందుకు పంపించాల్సి వచ్చిందని, అక్కడ కూడా బాలాదిత్య డిబేట్ చేస్కోలేకపోయాడని అంటున్నారు. ఏది ఏమైనా అతి మంచితనం మన కొంప ముంచుతుంది బాస్ అంటూ సలహాలు ఇస్తున్నారు. మరి ఈవారం నామినేషన్స్ లో బాలాదిత్య వస్తే ఏ రేంజ్ లో ఓటింగ్ జరుగుతుందనేది చూడాలి. అదీ మేటర్.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus