కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా మణిరత్నం దర్శకత్వంలో ‘నాయగన్’ అనే కల్ట్ సినిమా వచ్చింది. అప్పట్లో ఆ సినిమా పెద్ద హిట్టు. దాదాపు 38 ఏళ్ళ గ్యాప్ తర్వాత వీరి కాంబినేషన్లో ‘థగ్ లైఫ్’ అనే సినిమా వచ్చింది. సరిగ్గా నెల రోజుల క్రితం అంటే జూన్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయ్యింది. కన్నడలో తప్ప మిగిలిన అన్ని భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యింది. దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు.
రిలీజ్ కి ముందే నిర్మాతలు లాభపడ్డారు. కానీ డిస్ట్రిబ్యూటర్స్ కి మాత్రం భారీ నష్టాలు వచ్చి పడ్డాయి. మొదట 8 వారాల వరకు ఓటీటీ రిలీజ్ చేయకూడదు అని డిజిటల్ పార్ట్నర్ నెట్ ఫ్లిక్స్ వారితో అగ్రిమెంట్ చేసుకున్నారు నిర్మాతలు. కానీ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ముందుగానే డిజిటల్ రిలీజ్ కి ముందుకొచ్చారు. ఈ వీకెండ్ కి నెట్ ఫ్లిక్స్ కి వచ్చిన ‘థగ్ లైఫ్’ ఓటీటీ ప్రేక్షకులను కూడా డిజప్పాయింట్ చేసింది.
లెజెండరీ స్టేటస్ కలిగిన కమల్ హాసన్, రెహమాన్, మణిరత్నం ఇలాంటి సినిమా ఎలా చేశారు అనేది అర్థం కాలేదు అంటూ ఆడియన్స్ విమర్శిస్తున్నారు. టెక్నికల్ టీం పనితీరు తప్ప కథ, కథనాలు సహనం కోల్పోయేలా చేశాయని, సినిమాలో త్రిష పాత్రని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఆమె వేశ్య అనుకోవాలో? కమల్ హాసన్ ప్రియురాలు అనుకోవాలో అర్థం కాలేదని, ఆమె కోసం శింబు వెంటపడటం చాలా వరస్ట్ గా అనిపించిందని..
అతని పాత్రలో కూడా డీప్ ఎమోషన్ మిస్ అయ్యిందని.. ఇలా విమర్శిస్తూ వస్తున్నారు.’థగ్ లైఫ్’ కంటే ‘ఇండియన్ 2’ చాలా బెటర్ అని.. కమల్ హాసన్ ను ఇక నుండి శంకర్, మణిరత్నం వంటి దర్శకులను పక్కన పెట్టేసి లోకేష్ కనగరాజ్, నాగ్ అశ్విన్ వంటి టాలెంటెడ్ కుర్ర దర్శకులతోనే పని చేస్తే అతనికి ఉన్న మంచి పేరు నిలబడుతుందని సూచిస్తున్నారు. అది మేటర్.