ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అనే తేడాల్లేకుండా అనిరుధ్ కు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. అయితే తమిళ సినిమాలకు మ్యూజిక్ ఇచ్చిన స్థాయిలో తెలుగు సినిమాలకు మ్యూజిక్ ఇచ్చే విషయంలో అనిరుధ్ (Anirudh Ravichander) ఫెయిల్ అవుతున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. దేవర (Devara) సినిమాకు అనిరుధ్ ఇచ్చిన పాటలు బాగానే ఉన్నా దావూవీ సాంగ్ మాత్రం మరీ అద్భుతంగా లేదు ఈ పాట సినిమా క్లైమాక్స్ లో రోలింగ్ టైటిల్స్ పై వస్తుందని తెలుస్తోంది.
Anirudh Ravichander
ట్రైలర్ లో బీజీఎం బాగానే ఉన్నా మరీ టాప్ రేంజ్ లో లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తమిళ సినిమాలపై అనిరుధ్ కు (Anirudh Ravichander) ఉన్న ప్రేమ తెలుగు సినిమాలపై లేదా అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సినిమాకు అనుగుణంగా అనిరుధ్ మ్యూజిక్ అయితే ఉండటం లేదని పక్కాగా చెప్పవచ్చు. అనిరుధ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్నా ఆ సినిమాలకు పూర్తిస్థాయిలో న్యాయం అయితే చేయడం లేదు.
ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్న అనిరుధ్ బీజీఎంతో అయినా మెప్పిస్తారేమో చూడాల్సి ఉంది. దేవర రిజల్ట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అనిరుధ్ కెరీర్ ను సైతం డిసైడ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. దేవర సినిమా విడుదలకు మరో రెండు వారాల సమయం ఉండగా సినిమా రిలీజ్ సమయానికి ట్రైలర్ విషయంలో వచ్చిన కొంతమేర నెగిటివిటీ తగ్గుతుందేమో చూడాల్సి ఉంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) క్రేజ్ అంతకంతకూ పెరగాలని దేవర బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమా కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దేవర రిజల్ట్ పై దేవర సీక్వెల్ ఆధారపడి ఉందని చెప్పవచ్చు.