తెలంగాణలో బతుకమ్మ పండగ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా బతుకమ్మ పాటను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని కోసం ప్రముఖ దర్శకుడు గౌతమ్ మేనన్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కలసి ఓ పాటను రూపొందించారు. ఈ పాటను తెలంగాణ ప్రముఖ గాయకుడు మిట్టపల్లి సురేందర్ రాయగా… ప్రముఖ గాయకుడు ఉన్నిక్రిష్ణన్ పాడారని తెలుస్తోంది.
బతుకమ్మ పాటను ఇటీవల భూదాన్ పోచంపల్లి, రామోజీ ఫిలింసిటీలో షూట్ చేశారట. రాష్ట్రంలో అక్టోబరు 6 నుండి బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ లోపు అంటే అక్టోబరు 5న ఆ పాటను సిద్ధం చేసి విడుదల చేయడానికి టీమ్ ప్లాన్ చేస్తోందట. అంతేకాదు ఈ పాటను ఇతర భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయాలని అనుకుంటున్నారట. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత…
తన తెలంగాణ జాగృతి వేదిక ద్వారా ఈ ప్రత్యేక గీతం కోసం రెహమాన్, గౌతమ్ మేనన్‌లను కలిసి ఈ పాటను రూపొందించాలని కోరారని సమాచారం.