‘కేజీయఫ్ 2’ (KGF 2) సినిమా వచ్చిన కొత్తల్లో ప్రశాంత్ నీల్ (Prashanth Neel) – రామ్‌చరణ్ (Ram Charan) సినిమా గురించి ఓ చర్చ జరిగింది మీకు గుర్తుండే ఉంటుంది. కొన్ని రోజులు అయ్యి ఆ చర్చ ఆగిపోయాక హఠాత్తుగా చిరంజీవి ఇంట ప్రశాంత్ నీల్ కనిపించారు. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్యతో (D. V. V. Danayya) కలసి ఆయన చిరంజీవి (Chiranjeevi) ఇంటికి వచ్చారు. దీంతో చరణ్ – ప్రశాంత్ సినిమా పక్కా అనుకున్నారంతా. కానీ అనుకున్నది జరగలేదు. ఆయన ప్రభాస్‌తో, తారక్‌తో వరుస సినిమాలు ఓకే చేశారు.
మరోవైపు రామ్‌చరణ్ కూడా వరుస సినిమాలు ఓకే చేస్తుండటంతో ఇక ఇప్పట్లో ప్రశాంత్ నీల్‌తో సినిమా ఉండదు అని అనుకున్నారు. తద్వారా దానయ్య నిర్మాణంలో కూడానూ అని తేలిపోయింది. అయితే కొన్ని రోజుల క్రితం మరోసారి దానయ్య బ్యానర్‌లో రామ్‌చరణ్ సినిమా అనే మాట మళ్లీ వచ్చింది. ఈసారి దర్శకుడు కన్నడ నాట నుండి కాదు తమిళనాట నుండి అని చెప్పారు. ఆయనే లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj).
కమల్ హాసన్‌కు (Kamal Haasan) ‘విక్రమ్’ (Vikram) లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చి.. ఇప్పుడు రజనీకాంత్‌కు (Rajinikanth) ‘కూలీ’ (Coolie) లాంటి బ్లాక్‌బస్టర్‌లోడింగ్‌లో పెట్టారు. ఆ సినిమా తర్వాత కార్తితో (Karthi) ‘ఖైదీ 2’ (Kaithi) సినిమా చేస్తారు. సూర్యతో (Suriya) ‘రోలెక్స్’ కూడా ఉంది. అయితే ఈ లోపు రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేయాలని లోకేశ్ కనగరాజ్ అనుకుంటున్నారని.. దానికి దానయ్య నిర్మాత అవ్వొచ్చు అని ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే ఆ ప్రాజెక్ట్ నిర్మాత ఆయన కాదు అని లేటెస్ట్ టాక్.
రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా (Buchi Babu Sana), సుకుమార్‌తో (Sukumar) లైనప్ ఫిక్స్ చేసుకున్నారు. ఆ తర్వాత లోకేశ్ కనగరాజ్‌తో సినిమా ఉంటుందట. ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ హ్యాండిల్ చేస్తారట. త్వరలోనే ఈ అనౌన్స్‌మెంట్ ఉంటుంది అని చెబుతున్నారు. ఆ రోజున ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి అని చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మార్చి 26న ఈ అనౌన్స్‌మెంట్ రావొచ్చు.