యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమా షూటింగ్ అంతకంతకూ ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తుండటంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతుండగా యంగ్ టైగర్ అభిమానులు మాత్రం తెగ టెన్షన్ పడుతున్నారు. ఎన్టీఆర్ వేగంగా సినిమాలు చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అటు ఎన్టీఆర్ వైపు నుంచి కానీ ఇటు కొరటాల శివ వైపు నుంచి కానీ ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎలాంటి అప్ డేట్ రావడం లేదు.
సాధారణంగా ఎన్టీఆర్ ఖాళీగా ఉండటానికి అస్సలు ఇష్టపడరు. అయితే ఆచార్య సినిమా భారీ నష్టాలను మిగిల్చిన నేపథ్యంలో కొరటాల శివ తర్వాత సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో నటించిన హీరో తర్వాత సినిమా ఫ్లాప్ అని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సెంటిమెంట్ ను ఇప్పటివరకు ఏ సినిమా బ్రేక్ చేయలేదు. ఆచార్య సినిమాతో ఈ సెంటిమెంట్ బ్రేక్ అవుతుందని అందరూ భావించినా అందుకు భిన్నంగా జరిగింది.
కొరటాల శివ ఎన్టీఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో పాటు తనపై వ్యక్తమైన విమర్శలకు చెక్ పెట్టాలని అనుకుంటున్నారు. ఈ సినిమాకు తారక్ 60 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుండగా కొరటాల శివ 25 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారు. ఐదు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. వచ్చే ఏడాది సమ్మర్ టార్గెట్ గా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తుండగా ఆ విధంగా జరుగుతుందో లేదో చూడాల్సి ఉంది.
ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా తన ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్లు చేరేలా జాగ్రత్త పడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైతే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ కూడా ఆలస్యమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.