ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమాకు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ ను సొంతం చేసుకోవడంతో బన్నీకి అవార్డ్ రావడం గురించి చర్చ జరుగుతోంది. బన్నీకి ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కష్టం ఉంది. 20 ఏళ్ల సినీ కెరీర్ లో బన్నీ ఎన్నో వైవిధ్యమైన రోల్స్ లో నటించి మెప్పించారు. సౌత్ ఇండియాలో సిక్స్ ప్యాక్ ట్రెండ్ ను మొదలుపెట్టింది అల్లు అర్జున్ కావడం గమనార్హం.
ఇన్ స్టాగ్రామ్ లో బన్నీకి 20 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. రుద్రమదేవి సినిమా కోసం ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా బన్నీ నటించడం గమనార్హం. పాలకొల్లులోని పంచరామ క్షేత్రం కోసం 18 లక్షల రూపాయలు బన్నీ విరాళం ఇవ్వడం గమనార్హం. వేదం సినిమాతో మల్టీస్టారర్ సినిమాల దిశగా బన్నీ అడుగులు వేసి ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు. కేరళలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో బన్నీ ఒకరు.
ప్రతి గురువారం బన్నీ ఫ్యాన్స్ తో డైరెక్ట్ గా ఫోటోలు దిగుతారు. టాలీవుడ్ లో ఈ విధంగా చేసే హీరో అల్లు అర్జున్ కావడం గమనార్హం. పుష్ప సినిమాలోని పాత్ర కోసం బన్నీ ఎంతో కష్టపడ్డారు. పుష్ప ది రైజ్ సినిమా ఫుల్ రన్ లో 365 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. బన్నీకి అవార్డ్ రావడంతో పుష్ప2 మూవీపై ఒత్తిడి పెరిగింది. బన్నీ సుక్కు తొలి పార్ట్ ను మించి ఈ సినిమా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.
ఈ సినిమా (Pushpa2) టార్గెట్ 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు కాగా ఈ సినిమా అంతకు మించి కలెక్షన్లను సొంతం చేసుకుంటుందేమో చూడాల్సి ఉంది. సీక్వెల్ పై అంచనాలు భీభత్సంగా పెరగడంతో ఆ అంచనాలను అందుకునేలా మేకర్స్ జాగ్రత్త వహించాలి. పుష్ప ది రూల్ సినిమా అంచనాలను మించి విజయం సాధించి సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.