పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మలయాళ సినిమా రీమేక్ గా భీమ్లా నాయక్ మూవీ తెరకెక్కగా ఫిబ్రవరి 25వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ కథనం, మాటలు అందించడంతో ఈ సినిమాకు భారీస్థాయిలో బిజినెస్ జరిగింది. సంక్రాంతికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా వేర్వేరు రీజన్స్ వల్ల ఈ సినిమా వాయిదా పడింది.
అయితే భీమ్లా నాయక్ షూటింగ్ ఇప్పటివరకు పూర్తి కాలేదు. మరోవైపు ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు అమలులోకి రావడంతో పాటు థియేటర్లలో మూడు షోలు మాత్రమే ప్రదర్శితమవుతున్నాయి. ఈ నిబంధనల వల్ల భీమ్లా నాయక్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తైనా ఫిబ్రవరి 25వ తేదీనాటికి ఈ సినిమా రిలీజ్ కావడం కష్టమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయనే సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ మేకర్స్ ఏప్రిల్ 1వ తేదీని కూడా పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
అయితే ఆ తేదీన ఆచార్య సినిమా కూడా రిలీజ్ కానుంది. అన్నయ్య సినిమాకు పోటీగా పవన్ తన సినిమాను రిలీజ్ చేయకపోవచ్చని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ రెండు రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకోవడంతో మార్చి, ఏప్రిల్ లో రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకోవడం పెద్ద సినిమాలకు కష్టమైంది. భీమ్లా నాయక్ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. 100 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.
పవన్ భీమ్లా నాయక్ సినిమాతో వకీల్ సాబ్ సినిమాను మించిన సక్సెస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలను విడుదల చేసేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటూ ఉండటం గమనార్హం.