లియో సినిమాలో నటించిన నటుడు మన్సూర్ అలీ నటి త్రిష పట్ల చేసినటువంటి కామెంట్స్ దేశ వ్యాప్తంగా ఎంతటి దుమారం రేపుతున్నాయో మనకు తెలిసిందే. లియో సినిమాలో విజయ్ త్రిష భార్య భర్తలుగా నటించారు. అయితే ఈ సినిమాలో నటించినటువంటి మన్సూర్ అలీ త్రిష గురించి మాట్లాడుతూ నేను పలు సినిమాలలో హీరోయిన్లతో బెడ్రూమ్ సన్ని వేషాలు చేశాను. ఇక ఈ సినిమాలో కూడా త్రిష హీరోయిన్ అంటే తనని బెడ్ రూమ్ లోకి ఎత్తుకెళ్లి రేప్ చేసే సన్నివేశాలు ఉంటాయి అనుకున్నాను కానీ లేవు అంటూ చాలా చెత్తగా మాట్లాడారు.
ఇలా త్రిష గురించి మన్సూర్ అలీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇది కాస్త పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఇక ఈ విషయంపై త్రిష కూడా తీవ్రస్థాయిలో ఖండించారు. అనంతరం ఈమెకు మద్దతుగా సినీ సెలెబ్రిటీలు అందరూ కూడా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా మన్సూర్ అలీ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా తనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే ఈమెకు ఎంతోమంది టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా మద్దతు తెలిపారు. తాజాగా నటి రోజా కూడా ఈ విషయంపై తీవ్రస్థాయిలో ఖండించి అలాంటి వ్యక్తుల పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ క్రమంలోనే నటుడు నితిన్ కూడా త్రిషకు మద్దతు తెలుపుతూ మన్సూర్ అలీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా (Nithiin) నితిన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ…
హీరోయిన్ త్రిష గురించి మిస్టర్ మన్సూర్ అలీ చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఈ విధమైనటువంటి అహంకారపూరిత వ్యాఖ్యలకు ఇండస్ట్రీలో చోటు ఉండకూడదని మహిళలకు వ్యతిరేకంగా చేసే ఇలాంటి వ్యాఖ్యలను ప్రతి ఒక్కరు తప్పకుండా ఖండించాలని ఈయన తెలిపారు. ప్రస్తుతం నితిన్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో అల్లరి బుల్లోడు అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.