అదేంటి అలా జరగడానికి వీల్లేదు అని మీరు ఎంత నేత్తీనోరు కొట్టుకున్నా.. మీరు చదివింది నిజమే. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు ఓవర్సీస్ లోనూ “జెర్సీ” ఆశించిన స్థాయి కలెక్షన్స్ సాధించకపోవడమే కాదు డిస్ట్రిబ్యూటర్స్ కి కానీ, ఎగ్జిబిటర్స్ కి కానీ లాభాలు కాదు కదా కనీసం పెట్టిన ఎమౌంట్ కూడా తెచ్చిపెట్టలేకపోయింది. ఒక్క సీడెడ్ లోనే సినిమాకి కొనుక్కున్నవాళ్లకి కోటి రూపాయల నష్టం వచ్చిందంటే ఆలోచించాల్సిన విషయమే. నిజానికి సినిమాకి వచ్చిన వర్డ్ ఆఫ్ మౌత్ మరియు రివ్యూల బట్టి “జెర్సీ” నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ హిట్ అయిపోతుందని కనీసం 40 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది.
సినిమా బిజినెస్ 26 కోట్ల వరకు అవ్వగా.. ఇప్పటికీ కేవలం కొన్ని ఏరియాల్లో మాత్రమే పెట్టిన ఎమౌంట్స్ రీఫండ్ అయ్యాయి. ప్రారంభ వసూళ్ల విషయంలో నాని మునుపటి చిత్రమైన ‘దేవదాస్”ను కూడా క్రాస్ చేయలేకపోయింది “జెర్సీ”. దాంతో సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ పరంగా సినిమా ఫ్లాపయ్యిందని తెగ బాధపడిపోతున్నారు నాని & టీం. ముఖ్యంగా “కాంచన 3” సింగిల్ స్క్రీన్ లో జెర్సీని దెబ్బ కొడితే.. ఆ తరువాత వారం విడుదలైన “అవెంజర్స్ ఎండ్ గేమ్” ఏమో మల్టీప్లెక్స్ మరియు ఓవర్సీస్ లో జెర్సీ కలెక్షన్స్ కు గండికొట్టింది. దాంతో “జెర్సీ”కి సూపర్ హిట్ టాక్ వచ్చినా ఫ్లాప్ రిజల్ట్ మాత్రం తప్పలేదు.