మీడియా ముందుకొచ్చేటప్పుడు సెలబ్రిటీలు ఏ విషయంలోనైనా సరే జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే చాలా ఈజీగా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కి గురవుతుంటారు. పొరపాటు చేసేశాక నెటిజన్లకు ఆన్సర్ చెప్పలేక.. వాళ్లకి వివరణ ఇచ్చుకోలేక నెత్తీ నోరూ కొట్టుకోవాలి.. మిగతా స్టార్లతో పోలిస్తే బాలీవుడ్ స్టార్స్ కాస్త ఎక్కువగా ట్రోలింగ్స్ ఫేస్ చేస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే.. పబ్లిక్‌లోకి వచ్చేటప్పుడు డ్రెస్సింగ్, ప్రవర్తన విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి.. దీని కారణంగానే యాక్ట్రెస్ హ్యుమా ఖురేషీని ఓ ఆట ఆడేసుకుంటున్నారు నెటిజన్లు..
బ్రహ్మానందం.. నువ్వు ఎంచుకున్న రాగమేంటి?.. తీసుకున్న తాళమేంటి?.. అన్నట్టు.. ‘నీ పర్సనాలిటీ ఏంటి.. ఆ డ్రెస్ ఏంటి?’ అంటూ హ్యూమానీ ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ల ఫోకస్ కెనడియన్ బ్యూటీ నోరా ఫతేహి మీద పడింది. ప్రస్తుతం మీడియా అండ్ సోషల్ మీడియాలో నోరా గురించి విపరీతంగా న్యూస్, ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి.. వివరాల్లోకి వెళ్తే.. నోరా ఫతేహి, ఖతర్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ స్టేజ్ మీద తన పర్ఫార్మెన్స్‌తో జనాలని ఆకట్టుకుంది.
ఆ తర్వాత అభిమానులను ఉద్దేశించి నాలుగు మాటలు మాట్లాడింది. ఆ టైంలో ఇండియాకి చెందిన ఒక వ్యక్తి స్టేజీ ముందు మన జాతీయ జెండాను ప్రదర్శిస్తున్నాడు. అది చూసి నోరా.. జెండాను ఇవ్వమని కోరింది. అతను జెండా ఇవ్వగా.. మువ్వన్నెల జెండాను ఫిఫా స్టేజ్‌పై గర్వంగా ప్రదర్శించింది. అయితే అంతమందిలో టెన్షన్ పడిందో, లేక కంగారులో గమనించలేదో కానీ జాతీయ జెండాను తలకిందులుగా పట్టుకుంది.. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది..
తన మీద నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. భారత జాతీయ జెండాను అలా ఎలా రివర్స్‌లో పట్టుకుంటుంది?.. నోరా ఫతేహి తప్పకుండా క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తూ.. తెగ ట్రోల్ చేస్తున్నారు.. స్పెషల్ సాంగ్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ హిందీ, తెలుగు, తమిళ్, మలయాళంలోనూ ఆడిపాడింది.. బేసిగ్గా సూపర్బ్ డ్యాన్సర్ అయిన నోరా ఫతేహి డ్యాన్స్‌కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది..
Nora Fatehi Live Performance in Qatar. FIFA World Cup Qatar 2022. #FIFAWorldCup #FIFAWorldCupqatar2022 #FIFAFanFestival #NoraFatehi #livedance #liveperformance pic.twitter.com/kRP0gh6EnY
— Bipin Kumar Pal (@webbipinpal) November 29, 2022
Never Trust A ️umslim to hold and respect the Indian Flag Correctly!#NoraFatehi pic.twitter.com/0bN6mP3Un8
— CAAptain Sanghi (@Fight4TrueIndia) December 2, 2022
లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..