తెలుగువారు ఎక్కడున్నా తెలుగువారే. తెలుగు సినిమాలను చూడడమే కాదు.. భారీ మొత్తంతో కొని అందరికీ చూపిస్తారు కూడా. దీంతో ఓవర్సీస్ లో మన చిత్రాలకు డిమాండ్ పెరిగింది. అందుకు తగ్గట్టు వసూళ్లు కూడా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఓవర్సీస్ లో తెలుగు చిత్రాల కలక్షన్స్ పరిశీలిస్తే మనోళ్ళకు సినిమాలంటే ఎంతిష్టమో అర్ధమవుతుంది. ఈ ఏడాదికి బాహుబలి 2 అమెరికన్ మార్కెట్ లో 20 మిలియన్ డాలర్లు పైనే వసూలు చేసి రికార్డు సృష్టించింది. నంబర్ వన్ స్థానాన్ని కైవశం చేసుకుంది. రెండో స్థానంలో షారూఖ్ సినిమా రయీస్ నిలిచింది. ఈ మూవీ 3.6 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఆ తర్వాత స్థానాన్ని 2.4 మిలియన్ డాలర్లు రాబట్టి ఖైదీ నంబర్ 150 సినిమా దక్కించుకుంది.
బద్రినాథ్ కి దుల్హనియా 1.9 మిలియన్ డాలర్లు వసూలు చేసి 4వ స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఫిదా సినిమా 1.7 మిలియన్లు వసూలు చేసి దూసుకుపోతోంది. ఈ లెక్కన ఓవర్సీస్ లో అత్యధిక కలక్షన్స్ రాబట్టిన టాప్ 5 చిత్రాల్లో మూడు మనవే ఉన్నాయి. ఈ విషయాన్నీ పరిశీలిస్తే తెలుగు సినిమాలనే ఎన్నారైలు ఎక్కువగా చూస్తున్నారని అర్ధమవుతోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.