రాజమౌళి సినిమాలో ప్రతి పాత్రకు కథలో ప్రాముఖ్యం ఉంటుంది. ఇక హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఒక హీరోయిన్ గా అలియా భట్ ని తీసుకున్నారు. ఐతే గతంలో అసలు అలియా పాత్రకు అంత ప్రాధాన్యం ఉండదు అని, అందుకే ఈ ప్రాజెక్ట్ నుండి అలియా తప్పుకున్నారంటూ కొన్ని వార్తలు రావడం జరిగింది. ఆ తరువాత అవన్నీ పుకార్లే అని తేలిపోయింది. అలియా పాత్రపై మరో కొత్త కోణం కూడా ప్రచారంలోకి వచ్చింది.
కొమరం భీమ్ ఎన్టీఆర్, అల్లూరి గా చేస్తున్న చరణ్ మరియు అలియాల మధ్య ట్రై యాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందని వార్తలు వచ్చాయి. వీటిని ఆర్ ఆర్ ఆర్ యూనిట్ ఖండించడమే కాకుండా ఓ క్లారిటీ కూడా ఇచ్చారు. ఇది ట్రై యాంగిల్ లవ్ స్టోరీ కాదని చెప్పిన ఆర్ ఆర్ ఆర్ యూనిట్ అలియా పాత్ర చాల ఇన్నోసెంట్ అండ్ సాఫ్ట్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు. అలాగే ఎన్టీఆర్, చరణ్ , అలియా మధ్య ఉమ్మడి సన్నివేశాలు ఉంటాయని కూడా హింట్ ఇచ్చారు .
దీనితో అలియా పాత్రకు ఆర్ ఆర్ ఆర్ చాలా ప్రాధాన్యం నిడివి ఉంటుందని అర్థం అవుతుంది. వీరిద్దరి పోరాటంలో సీతగా అలియా తనదైన పాత్ర పోషించే అవకాశం కలదు. చరణ్ ప్రేయసిగా, ఇటు వీరిద్దరి ఉద్యమం లో మద్దతుగా ఆమె పాత్ర కథలో కీలకంగా సాగే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ కి అంత ప్రాధాన్యత ఉండే అవకాశం లేదు. ఈమెను కొన్ని రొమాంటిక్ సన్నివేశాలకు, సాంగ్స్ కి పరిమితం చేసే అవకాశం ఉంది.