ఎన్టీఆర్….హిట్ కొట్టాడు….మామూలు హిట్ కాదు…భారీ హిట్…ఇంకా చెప్పాలి అంటే…హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు…ఈ ఏడాది రెండు హిట్స్ అందుకున్న ఏకైక హీరో కూడా ఎన్టీఆర్ అని చెప్పక తప్పదు….ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ భారీ హిట్ అయితే ఇచ్చాడు కానీ….ఆ తరువాత సినిమా మాత్రం ఇంకా ఎవరితో చేస్తున్నాడో ఎవరికీ తెలీదు…అసలు ఇప్పటివరకూ ఎన్టీఆర్ ఏ సినిమాకి సైన్ కూడా చెయ్యలేదు…
అయితే అదే క్రమంలో…‘జనతా గ్యారేజ్’ సూపర్ సక్సస్ తో అటువంటి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వగల సమర్ధుడైన దర్శకుడు కోసం జూనియర్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతేకాకుండా తాను చేస్తున్న ప్రయత్నాలు విఫలం కావడంతో….చాలా టెన్షన్ పడుతున్నాడు…అయితే విషయం ఏమిటంటే…..విజయదశమి రోజున పవన్ ఎ.ఎమ్. రత్నంల సినిమా ప్రారంభం కావడంతో త్రివిక్రమ్ పవన్ ల సినిమా లేనట్లే అని న్యూస్ బయటకు రావడంతో త్రివిక్రమ్ తో సినిమాకి ఎన్టీఆర్ ప్లాన్ చేశాడు….తనకు అత్యంత సన్నిహితుడైన ఒక ప్రముఖ నిర్మాతను జూనియర్ త్రివిక్రమ్ వద్దకు పంపి రాయబారం నిర్వహించినట్లు సమాచారం.
ఇక ఈ రాయబారాన్ని మైత్రి మూవీస్ నిర్మాతలు నిర్వహించారు అని ఫిలింనగర్ టాక్. ఇదిలా ఉంటే…త్రివిక్రమ్ స్వాభావం తెలిసిన ఎన్టీఆర్…త్రివిక్రమ్ ఈ బ్యానర్ లో చేయడానికి ఇష్టపడకపోతే హారిక హాసిని బ్యానర్ లోనైనా తాను రెడీ అని, అదీ కుదరకపోతే కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ లో ఈ సినిమాను తీద్దాము అని సంకేతాలు కూడపంపినట్లు తెలుస్తోంది. కానీ త్రివిక్రమ్ మాత్రం ఎక్కడా ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు రెడీగా లేకపోవడం అంతేకాకుండా….ఎఎమ్ రత్నంకు వున్న సమస్యలు, ఆయన ఆబ్లిగేషన్ల మేరకు పవన్ ఆ సినిమాకు పూజ కార్యక్రమాన్ని జరిపించాడు అని, ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ పవన్ తో మరో సినిమా చేస్తాడు అని తెలియడంతో ఎన్టీఆర్ ప్లాన్ వర్కౌట్ కాలేదు….ఇక అదంతా పక్కన పెట్టి తనకు భారీ హిట్ ఇవ్వగల దర్శకుడి కోసం ఎన్టీఆర్ అన్వేషిస్తున్నాడు అని తెలుస్తుంది…చూద్దాం మరి ఏం జరుగుతుందో.