అభిమానం అంటే….ఇష్ట పడటం…నచ్చిన వ్యక్తిపై చూపించే ఆప్యాయత…కానీ మన టాలీవుడ్ విషయానికే వస్తే….దాన్ని భక్తి అని కూడా పిలుస్తూ ఉంటారు….మన టాలీవుడ్ లో ఉన్న ప్రతీ హీరోకి ఒక వంశం ఉంది, ఆ వంశం నుంచి వచ్చిన హీరోలు ఉన్నారు. వరుస సినిమాలతో ఎవరికి వారు దూసుకుపోతున్నారు. అయితే ఈ మధ్య జరిగిన ఒక సంఘటన అభిమానం అన్న మత్తులో మన వాళ్ళు ఎలా జోగుతున్నారో చూపించింది…
అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అన్న విషయాలు పక్కన పెడితే….టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వీరాభిమాని ఒకరు హత్య చేయబడ్డాడు. కొందరు ప్రేమ గొడవలో భాగంగా ఈ హత్య జరిగింది అంటుంటే…మరికొందరు వ్యక్తిగత కారణాల వల్ల ఈ హత్య జరిగింది అంటూ చెబుతున్నారు…ఇక దిగజారిపోయిన కొన్ని మీడియా సంస్థలు అయితే ఏకంగా మరో టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ ఫ్యాన్ ఈ హత్య చేశాడు అని ప్రచారం చేసింది. అయితే అక్కడ ఏం జరిగిందో తెలీదు, మొత్తానికి న్యూస్ మాత్రం “ఎన్టీఆర్ అభిమాని చేతిలో పవన్ అభిమాని హత్య’ అన్న పచ్చి బాషలో బయటకు వచ్చింది. అయితే ఆ కుటుంభాన్ని పరామర్శించిన పవన్ కల్యాణ్ ‘మితిమీరిన అభిమానం’మంచిది కాదు, అందరూ కలసి ఉండాలి అని చెప్పాడు.
ఇక దానిపై ఎన్టీఆర్ మాట్లాడలేదు అంటూ ఎన్టీఆర్ ను టార్గెట్ చేసిన వారికి ఎన్టీఆర్ ఒక ఓపెన్ లెటర్ రూపంలో అందరి హీరోల అభిమానులకు సమాధానం ఇచ్చాడు…మా హీరోలు అందరూ ఉన్నది మిమ్మల్ని అలరించడానికి, అంతేకాకుండా మేమంతా స్నేహభావంతో ఉన్నాం, కానీ అభిమానులు మాత్రం ఇలా వర్గాలుగా విడిపోయి గొడవలు పడుతున్నారు…దయచేసి అభిమానాన్ని హద్దుల్లో ఉంచుకుని మీ కుటుంభం గురించి ముందు ఆలోచించండి అని తన బాధను వ్యక్తం చేశాడు…ఎన్టీఆర్ రాసిన ఆ ఓపెన్ లెటర్ ఇదే..