Nuvvele Nuvvele Song: వైరల్ అవుతున్న ‘ఉషాపరిణయం’ లోని 3వ పాట..!
- June 22, 2024 / 07:24 PM ISTByFilmy Focus
సీనియర్ స్టార్ డైరెక్టర్ కె.విజయ భాస్కర్ (K. Vijaya Bhaskar) అంటే తెలియని వారంటూ ఉండరు. ‘నువ్వే కావాలి’ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాని అందించిన ఆయన.. ‘స్వయంవరం’ ‘నువ్వు నాకు నచ్చావ్’ (Nuvvu Naaku Nachav) ‘మల్లీశ్వరి’ (Malliswari) ‘మన్మధుడు’ ‘ప్రేమకావాలి’ (Prema Kavali) వంటి కల్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలని కూడా డైరెక్ట్ చేశారు. ఇప్పుడు ఆయన రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన తనయుడు శ్రీ కమల్ ను హీరోగా పెట్టి ‘ఉషాపరిణయం’ అనే సినిమా చేశారు.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్, రెండు పాటలు బయటకు వచ్చాయి. అవన్నీ దర్శకులు విజయ్ భాస్కర్ స్టైల్లోనే ఉన్నాయి. ఇదే క్రమంలో ఇప్పుడు 3వ పాటను కూడా విడుదల చేశారు. ‘నువ్వులే నువ్వులే’ అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ 3 నిమిషాల 22 సెకన్ల నిడివి కలిగి ఉంది. ‘నువ్వులే నువ్వులే నా ప్రాణమే నువ్వులే… నీదిలే నీదిలే నా ఊపిరి నీదిలే’ అంటూ స్టార్ట్ అయిన ఈ పాట వినడానికి చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది.

విజయ్ భాస్కర్ మ్యూజిక్ టేస్ట్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన సినిమాల్లోని చాలా పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఈ ‘నువ్వులే నువ్వులే’ సాంగ్ కూడా అదే స్థాయిలో ఉందని చెప్పొచ్చు. సంగీత దర్శకుడు ఆర్.ఆర్.ధృవన్ అందించిన ట్యూన్ క్యాచీగా ఉంది. ధృవన్ తో కలిసి అదితి భావరాజు ఎంతో ఆహ్లాదకరంగా ఈ పాటను ఆలపించారు. మీరు కూడా ఒకసారి చూస్తూ వినండి :














