పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ఓజి’. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామా నిన్న అంటే సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకు ముందు రోజే ప్రీమియర్ షోలు కూడా వేశారు. 2,3 ఏళ్ళ నుండి పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. గ్లింప్స్ తో ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది.
టీజర్, ట్రైలర్ వంటివి కూడా ఆకట్టుకోవడం.. అలాగే మొదటి రోజు సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి అనే చెప్పాలి. ఇక లేట్ చేయకుండా ‘ఓజి’ ఫస్ట్ డే కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 17.2 cr |
సీడెడ్ | 10.5 cr |
ఉత్తరాంధ్ర | 5.75 cr |
ఈస్ట్ | 7.35 cr |
వెస్ట్ | 4.28 cr |
గుంటూరు | 6.25 cr |
కృష్ణా | 4.15 cr |
నెల్లూరు | 1.82 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 57.3 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 5.82 cr |
ఓవర్సీస్ | 20.15 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 83.27 (షేర్) |
‘ఓజి’ చిత్రానికి రూ.173 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.174 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా ఏకంగా రూ.83.27 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.135 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. సినిమాకి భారీ హైప్ ఉంది. దానికి తోడు పాజిటివ్ టాక్ రావడంతో.. మొదటి 40 శాతం పైనే రికవరీ సాధించి చరిత్ర సృష్టించింది. ఇక బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.90.73 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.