Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » ఒక అమ్మాయి తప్ప

ఒక అమ్మాయి తప్ప

  • June 10, 2016 / 01:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒక అమ్మాయి తప్ప

“వెంకటాద్రి ఎక్స్ ప్రెస్” తర్వాత హిట్ కోసం అన్ని విధాలా ప్రయత్నిస్తూ, విఫలమవుతు వస్తున్న సందీప్ కిషన్ చేసిన సరికొత్త ప్రయత్నం “ఒక్క అమ్మాయి తప్ప”. రచయిత రాజసింహ తాడినాడ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిన ఈ చిత్రాన్ని సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అంజిరెడ్డి నిర్మించారు. నిత్యామీనన్ కథానాయికగా నటించిన ఈ సినిమా నేడు (జూన్ 10) విడుదలైంది.
మరి ఈ సినిమా సంగతేంటో చూద్దాం..!!

కథ: ఎటువంటి సమస్యనైనా కండబలం కాకుండా బుద్ది బలం ఉపయోగించి పరిష్కరించాలనుకొనే తెలివైన యువకుడు కృష్ణ (సందీప్ కిషన్). చిన్నప్పుడెప్పుడో ప్రపోజ్ చేసిన మ్యాంగో (నిత్యామీనన్) ను చాలా సంవత్సరాల తర్వాత చాలా విచిత్రమైన పరిస్థితుల్లో మళ్ళీ కలుసుకొంటాడు. వీరిద్దరు మధ్య ప్రేమ మళ్ళీ చిగురిస్తుందనుకొనే సమయంలో.. ఓ పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఫ్లై ఓవర్ చుట్టూ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అనుకోని పరిస్థితీల్లో అన్వర్ (రవికిషన్) అనే టెర్రరిస్ట్ వేసిన మాస్టర్ ప్లాన్ ను కృష్ణ ఆచరణలో పెట్టాల్సి వస్తుంది. ఆ టెర్రరిస్ట్ కు కృష్ణ ఎలా దొరికాడు? టెర్రరిస్ట్ ఆలోచనను కృష్ణ తన తెలివితో ఎలా ఎదుర్కొన్నాడు? అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు: కృష్ణ అనే కుర్రాడి పాత్రలో సందీప్ ఫర్వాలేదనిపించుకొన్నాడు. పెద్ద పెద్ద సమస్యలను కూడా చాలా తెలివిగా అతడు డీల్ చేసే విధానం సగటు ప్రేక్షకుడికి విస్మయాన్ని కలిగిస్తుంది. అయితే.. పతాక సన్నివేశాల్లో మాత్రం హీరోయిజమ్ సరిగా ఎలివేట్ చేయలేకపోయాడు.
బహుశా నిత్యామీనన్ కెరీర్ లో ఆమె పోషించిన క్యారెక్టర్ అంటూ లేని క్యారెక్టర్ ఇదేనేమో. సినిమా సెకండాఫ్ వరకూ అసలామె ఈ “ఫ్లై ఓవర్” డ్రామాలో ఎందుకు చిక్కుకుందో? అసలేం జరుగుతుందో ఎవ్వరికీ అర్ధం కాదు. అయినప్పటికీ.. తనదైన హావభావాలతో సన్నివేశాలకు ప్రాణం పోసింది. కాకపోతే.. మరీ లావుగా కనిపించడం ఒక్కటే ఆమె తరపున మైనస్. టెర్రరిస్ట్ కమ్ పోలీస్ ఆఫీసర్ గా రవికిషన్ తన పాత్ర పరిధిమేరకు ఫర్వాలేదనిపించుకొన్నాడు. కానీ.. సొంత డబ్బింగ్ వలన చాలా సన్నివేశాల్లో లిప్ సింక్ మిస్ అవుతుంది. సప్తగిరి, తాగుబోతు రమేష్, 30 ఈయర్స్ పృధ్వీల చేత కామెడీ చేయించాలని చేసిన ప్రయత్నాలు విఫలమవ్వడమే కాక కథను పక్కదారి పట్టించేలా ఉన్నాయి.
గుడ్డిలో మెల్ల అన్నట్లుగా.. అలీ మాత్రం కాస్త ప్రేక్షకుల్లో తన కామెడీతో చలనం తీసుకురాగలిగాడు.

సాంకేతికవర్గం పనితీరు: మిక్కీ జె.మేయర్ బాణీలు ఓ రెండు మినహా మిగాతవన్నీ చాలా రెగ్యులర్ గా ఉన్నాయి. అలాగే.. నేపధ్య సంగీతం కూడా హీరోయిజమ్ ఎలివేట్ చేసే సీన్స్ లో మినహా పెద్దగా అలరించలేకపోయింది. సీనియర్ కెమెరామెన్ ఛోటా కె.నాయుడు తన సీనియారిటీ మొత్తం రంగరించి సరికొత్త కెమెరా యాంగిల్స్ లో క్యారెక్టర్లను ఎలివేట్ చేద్దామని ప్రయత్నించాడు కానీ అది వృధా ప్రయాసగా మారింది. ముఖ్యంగా టైట్ క్లోజ్ నుంచి ఒక్కసారిగా జూమ్ లెన్స్ సాయంతో తీసిన టైమ్ ల్యాప్స్ షాట్స్ సినిమాకి మైనస్ లుగా మారడమే ఛాయాగ్రాహకుడిగా అతడి పరాజయానికి ప్రత్యక్ష సాక్ష్యం. సినిమా మొత్తం ఫ్లై ఓవర్ మీదనే నడుస్తుంటుంది. అయితే.. అది ఫ్లై ఓవర్ అనే విషయం లాంగ్ షాట్స్ మినహా ఎక్కడా అనిపించదు. ఇక లారీ యాక్సిడెంట్ సీన్స్ మరీ మొబైల్ గేమ్స్ ను తలపించడం నిర్మాత అంజిరెడ్డి నిర్మాణ విలువలకు అద్ధం పడుతుంది.

కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: రచయితగా “బావగారూ బాగున్నారా, రుద్రమదేవి, సరైనోడు” వంటి సక్సెస్ ఫుల్ సినిమాకు పనిచేసిన రాజసింహ తాడినాడ ఎప్పుడో 12 ఏళ్ల క్రితం ఈ సబ్జెక్ట్ ను రెడీ చేసుకొన్నాడని చెప్పాడు. పేలని పంచ్ డైలాగులు, ఎప్పుడో యూట్యూబ్, వాట్సాప్ లో చూసేసిన ఫన్నీ సీన్లు చూస్తే అది నిజమే అనిపించకమానదు.

కథలో కాస్తంత కొత్తదనం ఉంది, కానీ కథనం మాత్రం చాలా పేలవంగా ఉంది. ఇక దర్శకుడిగా రాజసింహ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. హైద్రాబాద్ కు గుండెకాయ లాంటి హైటెక్ సిటీలోని ఓ ఫ్లైఓవర్ పెద్ద లారీ యాక్సిడెంట్ కారణంగా జామ్ అయిపోతే.. ఒక్కరంటే ఒక్క పోలీస్ కూడా కనీసం అటువైపుకు రాకపోవడం, దాదాపుగా అయిదారు గంటల సేపు ట్రాఫిక్ జామ్ అయిపోయినా.. జనాలు చాలా సరదాగా అక్కడే బండ్ల మీద కూర్చోవడం, కార్లలో పడుకోవడం వంటివి చాలా అసహజంగా అనిపిస్తుంటాయి. “పేద్ద ట్రాఫిక్ జామ్ అయ్యింది” అనే టెన్షన్ అక్కడి జనాల్లో.. థియేటర్లో కూర్చోన్న ప్రేక్షకుల్లో కలిగించలేకపోయాడు దర్శకుడు. ఇక సందీప్ కిషన్-నిత్యామెన్ ల లవ్ ట్రాక్ ను కూడా సరిగా డిజైన్ చేయలేదు.

విశ్లేషణ: కథలో కొత్తదనం ఉంటే సరిపోదు, కథనంలోనూ ఆ కొత్తదనం అనేది ఉట్టిపడాలి. ముఖ్యంగా ఈ తరహా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు అత్యంత కీలకమైనది సహజత్వం. “ఒక్క అమ్మాయి తప్ప” సినిమాలో ఎక్కడా సహజత్వం అనేది కనిపించదు. ఇక ఫ్లై ఓవర్ సీన్స్ మరియు యాక్సిండెంట్ సీన్స్ లో సీజీ వర్క్ మరీ నీచంగా ఉంది. హీరో అతి తెలివి, విలన్ పనికిమాలిన ప్లానింగ్ కలగలిసిన “ఒక్క అమ్మాయి తప్ప” ప్రేక్షకుల సహనాన్ని పూర్తి స్థాయిలో పరీక్షిస్తుండనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఫైనల్ గా చెప్పాలంటే..
కాన్సెప్ట్ బాగుంది కానీ.. ప్రేక్షకుడ్ని ఆకట్టుకోలేని “ఒక్క అమ్మాయి తప్ప”

రేటింగ్: 2/5

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nitya menon
  • #Okka Ammayi Thappa
  • #Okka Ammayi Thappa Review
  • #Sundeep Kishan

Also Read

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

related news

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

Powerpeta: మూడు ముక్కల ‘పవర్‌ పేట’.. ఇప్పుడు మరో హీరో – నిర్మాత చేతుల్లోకి..

Powerpeta: మూడు ముక్కల ‘పవర్‌ పేట’.. ఇప్పుడు మరో హీరో – నిర్మాత చేతుల్లోకి..

trending news

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

11 hours ago
War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

11 hours ago
The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

13 hours ago
Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

17 hours ago
Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

19 hours ago

latest news

Kamalini Mukherjee: ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా వల్ల.. నేను తెలుగు సినిమాలకు దూరమయ్యాను : కమలినీ ముఖర్జీ

Kamalini Mukherjee: ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా వల్ల.. నేను తెలుగు సినిమాలకు దూరమయ్యాను : కమలినీ ముఖర్జీ

8 hours ago
Ghaati Censor Report: ఘాటి సెన్సార్ రివ్యూ

Ghaati Censor Report: ఘాటి సెన్సార్ రివ్యూ

10 hours ago
Akhanda 2: ఇట్స్ అఫీషియల్…  ‘అఖండ 2’ పోస్ట్ పోన్

Akhanda 2: ఇట్స్ అఫీషియల్… ‘అఖండ 2’ పోస్ట్ పోన్

10 hours ago
Mohanbabu: మహేష్ అన్న కొడుకు సినిమాలో విలన్ గా మోహన్ బాబు

Mohanbabu: మహేష్ అన్న కొడుకు సినిమాలో విలన్ గా మోహన్ బాబు

11 hours ago
Mega Comeback: ‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

Mega Comeback: ‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version