రాజమౌళి (S. S. Rajamouli) సీరియల్ డైరెక్ట్ చేశారు అని తెలుసు కానీ.. సీరియల్‌లో నటించారు అని తెలుసా? అది కూడా ఇప్పుడు స్టార్ యాంకర్ అయిన రష్మి గౌతమ్ (Rashmi Gautam) నటించిన సీరియల్‌లో అని తెలుసా? ఏంటీ ఇన్ని షాక్‌లు ఇస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు అంటే.. మీరు జెన్‌జీ అయి ఉండాలి. లేదు అంటే ఒకప్పటి సూపర్ హిట్ సీరియల్స్ చూడకపోయి ఉండాలి. అవన్నీ చూడకపోయినా ఇప్పుడు సోషల్ మీడియాను ఫాలో అవుతుంటే ఆ సీరియల్ ఏంటో, ఈ కాంబినేషన్ కథ ఏంటో మీకు తెలిసే ఉంటుంది.
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో మేటర్ ఏంటంటే.. ‘RRR’. అంటే రష్మి – రాజమౌళి మధ్యలో రొమాంటిక్. ఓ కెఫేలో ఉన్న రష్మిని రాజమౌళి వచ్చి కలుస్తారు. వారి మధ్యలో చిన్నసైజ్ ఓల్డ్ సినిమా స్టైల్ కళ్లు కళ్లు కలిసే రొమాంటిక్ సీన్ అది. ఒకప్పుడు అంటే 2007 – 2008 సమయంలో మాటీవీలో ‘యువ’ అనే ఓ సీరియల్ ప్రసారమయ్యేది. ఆ సీరియల్‌తోనే రష్మి ఇండస్ట్రీలోకి వచ్చింది.
అందులో స్వాతి అనే ప్రధాన పాత్ర చేసింది. అందులో ఓ ఎపిసోడ్‌లో రాజమౌళి కనిపిస్తాడు. రాజమౌళిలాగే ఆ సీరియల్ ఎంటర్ అవుతారు. రష్మితో ఫోన్‌లో మాట్లాడి, మాట్లాడి ఫైనల్‌గా చూడటానికి వస్తారు. ఫైనల్‌గా ఆమె కనుసైగలతో ఐలవ్‌యూ చెప్పినప్పుడు ఈయనకు అర్థంకాకపోవడం రష్మి అరుస్తుంది. ఆ సీనే ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఇద్దరి మధ్య చిన్న సాంగ్ కూడా ఉంది.
రాజమౌళి ‘విక్రమార్కుడు’ (Vikramarkudu) సినిమాలోని జింతాక్ మూమెంట్ వేస్తే.. రష్మి కారు మీద అలా వాలి నడుము ఊపుతూ వయ్యారాలు పోతుంది. ఇదంతా చూడటానికి భలే ఉంటుంది. ఈ వీడియో చూసి నెటిజన్లు రష్మి అప్పటి నుండి ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అన్నట్లు ఈ సీరియల్‌లో హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty) కూడా ఓ గెస్ట్ రోల్ చేసింది. ఆమె వీడియో కూడా సోషల్ మీడియాలో ఉండాలి.
Whatttt!!! Rajamouli and rashmi ideppudu jarigindi pic.twitter.com/nHM2LwyuCI
— EpicCommentsTelugu (@EpicCmntsTelugu) February 18, 2025