Prabhas: సన్నబడ్డ ప్రభాస్.. వీడియో వైరల్..!
- December 18, 2021 / 04:00 PM ISTByFilmy Focus
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘రాధే శ్యామ్’ చిత్రం వచ్చే నెలలో విడుదల కాబోతుంది.3ఏళ్ళ క్రితం ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైనప్పుడు ఎవ్వరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ ఇటీవల ‘రాధే శ్యామ్’ నుండీ విడుదలవుతున్న సాంగ్స్ మరియు ప్రోమోలకు మంచి రెస్పాన్స్ లభించింది. ‘రాధే శ్యామ్’ లో ఆకర్షించే కంటెంట్ చాలానే ఉన్నట్టు ఇన్సైడ్ టాక్. ఇక ఈ చిత్రంతో పాటు ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆది పురుష్’,
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్టు కె'(వర్కింగ్ టైటిల్) వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు ప్రభాస్. ఈ నేపథ్యంలో అతను విపరీతంగా బరువు పెరిగాడు.మొన్నటికి మొన్న అతని ఫోటోలు చూసిన అభిమానులు చాలా బాధపడ్డారు. ఎడతెగకుండా పెద్ద సినిమాలు చేయడం వలెనే అతను షేపౌట్ అయ్యాడనే కామెంట్స్ వినిపించాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ సన్నపడినట్టు అతని లేటెస్ట్ వీడియో ఒకటి చూస్తే స్పష్టమవుతుంది.

ఇటీవల ప్రభాస్ ఓ వెడ్డింగ్ ఫంక్షన్ కు హాజరయ్యాడు. అక్కడ ప్రభాస్ ను చూడడానికి అంతా ఎగబడ్డారు. మరీ ముఖ్యంగా లేడీస్ అతను చుట్టూ గుమికూడారు. ‘మిర్చి’ సినిమాలో బెల్లం చుట్టూ చీమలు చేరినట్టు అనే డైలాగ్ ను మళ్ళీ గుర్తుచేశారు. ఈ వీడియోలో ప్రభాస్ ఫిట్ గా కనిపిస్తున్నాడు. ఏమైనా ఎడిటింగ్ చేసారా? లేక నిజంగానే ప్రభాస్ సన్నపడ్డాడా? అనే కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి :
ఇలాగే కదా #ప్రభాస్ ను చూడాలనుకున్నాం #prabhas #prabhasdarling #darlingprabhas #raadheshyam #prabhaslook pic.twitter.com/0KbxMkRkOI
— Phani Kumar (@phanikumar2809) December 18, 2021
పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
















