సమంత తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెట్టింది. అందులో ‘‘ ఇమ్యూనిటీ బూస్ట్ ఉపయోగాలు.. తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. వ్యాధి నిరోధక వ్యవస్థని ఉత్తేజపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని సజావుగా ఉండేలా చేస్తుంది. కండరాల ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. శక్తిని పెంపొందిస్తుంది.వైరస్‌లు, ఇతర అపాయాల నుండి రక్షిస్తుంది. కార్డియో వాస్క్యులర్ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. ఎముకల శక్తిని పెంచుతుంది. కణాలకు రక్షణని ఇస్తుంది’’ అంటూ సెలైన్ బాటిల్ తో ఉన్న ఫోటోని షేర్ చేసింది సమంత.
ఈ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఎందుకంటే.. సమంత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఆమె మయోసైటిస్ అనే వ్యాధి భారిన పడటంతో.. ఆమెకి విపరీతమైన తలనొప్పి, కీళ్ల నొప్పులు, ఆయాసం వంటి లక్షణాలు ఎక్కువయ్యాయి. వీటి వల్ల ఆమె ఎక్కువ సేపు నిలబడలేదు. అందుకే సినిమాలను కూడా తగ్గించింది. ప్రస్తుతం సమంత దుబాయ్ లో ఉంది. అక్కడి హాస్పిటల్ లో ఈమె మెరుగైన వైద్యం చేయించుకుంటుందేమో అని అంతా భావిస్తున్నారు.
అక్కడ ఆమె ఓ కార్యక్రమానికి హాజరైంది. అక్కడ కెమెరాలకు ఈమె (Samantha) బ్యూటిఫుల్ ఫోజులు ఇవ్వడం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో ఆమె రిబ్స్ పై.. మాజీ భర్త పేరు లేకపోవడంతో అవి కూడా చర్చనీయాంశం అయ్యింది. ఆ టాటూని ఆమె తీయించేసుకున్నట్టు ఆ ఫోటో పై డిస్కషన్లు జరిగాయి. ఇక సమంత ఈ ఏడాది ‘శాకుంతలం’ ‘ఖుషి’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో ‘ఖుషి’ బాగానే ఆడింది.