‘సామజవరగమన’ చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.30 కోట్లు పైనే వసూళ్లు సాధించింది. ఇందులో ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వరకు కామెడీ బాగా పండింది. కథ పెద్దగా లేకపోయినా క్లైమాక్స్ లో ఇచ్చిన కన్క్లూజన్ బాగుంది. ఈ సినిమాకి ముందు శ్రీవిష్ణు వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ సినిమా తర్వాత అతని మార్కెట్ కొంచెం స్ట్రాంగ్ అయ్యింది.
అలాగే అతని కామెడీ టైమింగ్ కూడా మెరుగుపడింది. ఇక దర్శకుడు రామ్ అబ్బరాజు కూడా ఈ చిత్రంతో నిలదొక్కుకున్నాడు. ఆ వెంటనే శర్వానంద్ తో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. ‘నారి నారి నడుమ మురారి’ టైటిల్ తో ఈ సినిమా మొదలైంది. షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. కానీ ఎందుకు దీని రిలీజ్ పై క్లారిటీ రాలేదు.
బడ్జెట్ సమస్యల వల్ల ఆగిపోయింది అనే టాక్ కూడా నడుస్తోంది. ఈ క్రమంలో శ్రీవిష్ణుతో రామ్ అబ్బరాజు మరో సినిమాని సెట్ చేసుకోవడంతో ‘నారి నారి నడుమ మురారి’ పై అనుమానాలు మరింత పెరిగాయి అని చెప్పాలి. అనిల్ సుంకర కూడా గత రెండు సినిమాలతో నష్టాల బారిన పడ్డారు.
అందుకే ఆ ప్రాజెక్ట్ పై త్వరగా అప్డేట్ రావడం లేదు అని టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరోపక్క శ్రీవిష్ణు – రామ్ అబ్బరాజు కాంబినేషన్లో రూపొందనున్న మూవీని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మించబోతోంది అని టాక్ నడుస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.