మెగా పవర్ స్టార్ రాంచరణ్ టాలీవుడ్లో స్టార్ హీరోల్లో ఒకరు. నెంబర్ వన్ రేసింగ్ హీరో అని కూడా చెప్పవచ్చు. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఇతను వెయ్యి కోట్ల హీరో. ఆర్.ఆర్.ఆర్ కి ముందు వచ్చిన ‘రంగస్థలం’ వంటి రీజనల్ మూవీతో కూడా రూ.200 కోట్ల(గ్రాస్) వసూళ్లు కొల్లగొట్టాడు. ‘గేమ్ ఛేంజర్’ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. ఆ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న సినిమా బడ్జెట్ కూడా రూ.300 కోట్ల దాకా ఉంది.
Ram Charan vs Venkatesh
మరి ఇలాంటి స్టార్ తో సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ పోటీ పడటం ఏంటి? అతను పైచేయి సాధించడం ఏంటి అనుకుంటున్నారా? అయితే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే. వాస్తవానికి సీనియర్ స్టార్ హీరో అయిన వెంకటేష్ కి ఇప్పటి స్టార్ హీరో అయిన రాంచరణ్ తో సరిసమానమైన మార్కెట్ ఏమీ లేదు. కానీ సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాతో వచ్చిన ప్రతిసారీ వెంకటేష్ సినిమాలు భారీగా కలెక్ట్ చేస్తూ ఉంటాయి. 2013 సంక్రాంతికి రాంచరణ్ నటించిన ‘నాయక్’ సినిమా రిలీజ్ అయ్యింది.
ఇది హిట్ సినిమానే. అయితే ఆ పక్కనే రిలీజ్ అయిన వెంకటేష్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా ‘నాయక్’ కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది.అలాగే 2019 లో రాంచరణ్ ‘వినయ విధేయ రామ’ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది. కానీ దానికి మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ వచ్చింది. ఆ పక్కనే రిలీజ్ అయిన వెంకటేష్ ‘ఎఫ్ 2’ సినిమా భారీ వసూళ్లు సాధించింది. రూ.130 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.
ఇక ఇప్పుడు 2025 సంక్రాంతికి కూడా చరణ్, వెంకటేష్ బాక్సాఫీస్ బరిలో నిలబడనున్నారు. ఈ సారి చరణ్ ‘గేమ్ ఛేంజర్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి కొంత మిక్స్డ్ టాక్ వస్తుంది. మరోపక్క వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. సో మూడోసారి కూడా వెంకీ.. చరణ్ మీద పైచేయి సాధిస్తాడా? అనేది తెలియాల్సి ఉంది. అయితే ‘సీతమ్మ వాకిట్లో..’ కి మహేష్ బాబు సపోర్ట్ ఉంది. ‘ఎఫ్ 2’ లో వరుణ్ తేజ్ కూడా ఓ హీరో. ఈసారి మాత్రం వెంకీ సోలోగా చరణ్ తో తలపడనున్నాడు.