కమర్షియల్ సినిమాలకి ‘కేర్ అఫ్ అడ్రెస్స్’ అంటే డైరెక్టర్ వినాయక్ పేరే చెప్పాలి. మంచి మాస్ అండ్ కామెడీ యాంగిల్లో చిత్రాల్ని తెరకెక్కించి ప్రేక్షకుడు పెట్టిన టికెట్ కు పూర్తి న్యాయం చేసే డైరెక్టర్ వినాయక్ అందంలో అతిశయోక్తి లేదు. ఎన్నో సూపర్ హిట్లు, బ్లాక్ బాస్టర్లతో ఓ దశలో రాజమౌళినే మించేలా కనిపించాడు. అయితే తరువాత కొన్ని ప్లాపులతో వెనుకపడ్డాడు. ఇక చిరంజీవి 150 వ చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’ ను కూడా వినాయక్ డైరెక్ట్ చేసాడు. ఆ చిత్రం పెద్ద హిట్టయింది. కానీ ‘అఖిల్’ ‘ఇంటిలిజెంట్’ చిత్రాలు డిజాస్టర్లు కావడంతో పెద్దగా అవకాశాలు రావడం లేదు.ఇదిలా ఉండగా తాజాగా.. వినాయక్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. రాజమౌళి .. పూరి జగన్నాథ్ ల పై కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచ్చాడు.
వినాయక్ మాట్లాడుతూ… “నాకు రాజమౌళి .. పూరిలతో మంచి స్నేహం ఉంది. రాజమౌళిగారి ఇంటికి నేను వెళితే.. ఇంట్లో వాళ్ళంతా చాలా హడావిడి చేసేస్తుంటారు .. వాళ్ళలో ఆ ఆప్యాయత నాకు చాలా ఇష్టం. అందరం కూడా చాలా సరదాగా మాట్లాడుకుంటాము. ఇక ఎప్పుడైనా కాస్త ‘డల్’ గా అనిపించినప్పుడు పూరిని కలుసుకోవాలనిపిస్తుంది. ‘కాల్ చేసి బిజీగా ఉన్నావా?’ అని అడిగితే .. ‘ముందు వచ్చేసేయ్’ అంటాడు. ఎలాంటి భయం .. టెన్షన్ లేకుండా ఆయన బిందాస్ గా ఉంటాడు. అంత స్వేచ్ఛ గా వుండే ఆయనని చూసినప్పుడు, మళ్ళీ వచ్చే జన్మంటూ వుంటే పూరిలా పుట్టాలనిపిస్తుంది” అంటూ చెప్పుకొచ్చాడు.