Adipurush: ఆదిపురుష్ మూవీకి మరో భారీ షాక్ తగిలిందా.. ఏం జరిగిందంటే?

ప్రభాస్ రాముని పాత్రలో నటించిన ఆదిపురుష్ మూవీ విడుదలకు మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఇప్పటికే ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా మైథలాజికల్ సినిమాలలో ఈ సినిమా ట్రెండ్ సెట్ చేస్తుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆదిపురుష్ సినిమా టీజర్ విడుదలైన సమయంలో ఈ టీజర్ పై వచ్చిన నెగిటివ్ కామెంట్లు అన్నీఇన్నీ కావు.

ముఖ్యంగా కొన్ని పాత్రల గెటప్స్ విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం కావడం గమనార్హం. అయితే ఆదిపురుష్ సినిమా మళ్లీ ఒక వివాదంలో చిక్కుకుంది. సంజయ్ దీనానాథ్ తివారీ అనే సనాతన్ ధర్మ ప్రచారకర్త ఆదిపురుష్ సినిమాకు సంబంధించి స్పెషల్ స్క్రీన్ టెస్ట్ నిర్వహించాలని కోరారు. స్పెషల్ స్క్రీన్ టెస్ట్ తో పాటు ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ షిప్ నిర్వహించాలని ఆయన కోరారు.

ఇందుకు సంబంధించిన లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిటిషన్ విషయంలో కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ప్రభాస్ సినిమా వివాదాల్లో చిక్కుకోవడం అభిమానులకు ఏ మాత్రం ఇష్టం లేదు. ప్రభాస్ ఈ సినిమా కోసం 120 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకున్నారు. ప్రభాస్ వేగంగా షూటింగ్ లను పూర్తి చేసిన సినిమాలలో ఆదిపురుష్ సినిమా కూడా ఒకటి.

ఆదిపురుష్ (Adipurush) సినిమాకు ఏవైనా సమస్యలున్నా సినిమా రిలీజ్ సమయానికి ఆ సమస్యలు పరిష్కారం అయితే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ ఫ్లాపులకు ఆదిపురుష్ బ్రేక్ వేయడంతో పాటు ప్రభాస్ కు మరపురాని విజయాన్ని ఈ సినిమా అందిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. యుద్ధ కాండ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus