రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజైన రోజు నుంచి ఇప్పటివరకు ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకుల అంచనాలను అందుకున్న ఈ సినిమా మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా సంచలనాలు సృష్టిస్తోంది. కొన్ని నెలల క్రితం ఈ సినిమా జపాన్ లో విడుదల కాగా అక్కడి ప్రేక్షకులకు సైతం ఈ సినిమా ఎంతగానో నచ్చింది. ఆర్ఆర్ఆర్ మూవీ అక్కడ చరిత్ర సృష్టిస్తుండటం గమనార్హం.
ఈ సినిమా అక్కడ విడుదలై 20 వారాలు దాటినా కలెక్షన్లు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఇప్పటికీ జపాన్ లో ఆర్ఆర్ఆర్ 200కు పైగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. అక్కడ 1 బిలియన్ యిన్ కలెక్షన్లను సాధించి ఈ సినిమా అరుదైన రికార్డును సొంతం చేసుకోవడం గమనార్హం. ఆర్.ఆర్.ఆర్ మూవీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. జపాన్ లో కూడా ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందని చెప్పాలి.
ఆర్.ఆర్.ఆర్ మూవీ కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు రాజమౌళి కీర్తి ప్రతిష్టలను పెంచింది. మహేష్ సినిమా తాను మరో మెట్టు పైకి ఎదుగుతానని జక్కన్న భావిస్తున్నారు. మహేష్ మూవీ తర్వాత రాజమౌళి ఆర్.ఆర్.ఆర్2 లేదా బాహుబలి3 తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయి. బాహుబలి3 తెరకెక్కిస్తే బాగుంటుందని ఎక్కువమంది ప్రేక్షకులు భావిస్తున్నారు. మరి రాజమౌళి ఏ సినిమాకు ఓటు వేస్తారో చూడాల్సి ఉంది.
రాజమౌళికి నిర్మాతల నుంచి భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ ఆఫర్లు వస్తున్నాయని అయితే జక్కన్న మాత్రం ఆ ఆఫర్లకు నో చెబుతున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి ఆస్తుల విలువ కూడా భారీ రేంజ్ లో పెరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజమౌళి తర్వాత సినిమాలను హాలీవుడ్ లెవెల్ లో ప్లాన్ చేస్తుండగా జక్కన్న ప్లాన్స్ ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాల్సి ఉంది.