Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » ఒరేయ్ బుజ్జిగా సినిమా రివ్యూ & రేటింగ్!

ఒరేయ్ బుజ్జిగా సినిమా రివ్యూ & రేటింగ్!

  • October 1, 2020 / 10:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒరేయ్ బుజ్జిగా సినిమా రివ్యూ & రేటింగ్!

రొటీన్ కథను కొత్తగా చెప్పడం ఒక ఆర్ట్. మరీ రొటీన్‌గా చెప్పి ప్రేక్షకులను విసిగించడం వరస్ట్. ‘ఒరేయ్ బుజ్జిగా’ ట్రయిలర్, పాటలు చూసినప్పుడు కన్‌ఫ్యూజన్ కామెడీతో తీసినట్టు అర్థమవుతూ ఉంటుంది. స్క్రీన్ మీద కన్‌ఫ్యూజన్ కామెడీ నవ్వులు పూయించిందా? గత నాలుగు, ఐదు సినిమాలతో సరైన హిట్టు కొట్టలేకపోతున్న రాజ్ తరుణ్ ఈ సినిమాతో హిట్ కొట్టాడా? ఆల్మోస్ట్ ఐదేళ్ళ గ్యాప్ తరవాత డైరెక్షన్ చేసిన విజయ్ కుమార్ కొండా మళ్ళీ సక్సెస్ ట్రాక్ లో పడ్డారా?

కథ: బుజ్జి అలియాస్ శ్రీను, శ్రీనివాస్ (రాజ్ తరుణ్)ది నిడదవోలు. కృష్ణవేణి (మాళవికా నాయర్)దీ అదే ఊరు. ఒకరికి మరొకరితో పరిచయం లేదు. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని బుజ్జి, బావతో పెళ్లి ఇష్టం లేని కృష్ణవేణి ఒకరి వెనుక మరొకరు ఒకే ట్రయిన్ ఎక్కుతారు. అది చూసిన ఎవరో ఇద్దరూ కలిసి లేచిపోయారని పుకారు పుట్టిస్తారు. ట్రయిన్‌లో కృష్ణవేణికి తన పేరు శ్రీను అని బుజ్జిగాడు పరిచయం చేసుకుంటాడు. తన పేరు స్వాతి అని కృష్ణవేణి చెప్తుంది. బుజ్జిగాడు అసలు పేరు శ్రీను అని కృష్ణవేణికి తెలియదు. కృష్ణవేణి ఎలా ఉంటుందో బుజ్జి అలియాస్ శ్రీనుకి తెలియదు. వాళ్ళిద్దరికీ ఒకరి గురించి మరొకరికి ఎప్పుడు తెలిసింది? ఈలోపు ఊళ్లో ఏం జరిగింది? చివరికి ఏమైంది? అనేది సినిమా.

నటీనటుల పనితీరు: రాజ్ తరుణ్, మాళవికా నాయర్ ఇద్దరూ సహజంగా నటించారు. వాళ్ళిద్దరి నటన, డైలాగ్ డెలివరీ వల్ల కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. యాక్టింగ్ పరంగా ఛాలెంజ్ విసిరే సన్నివేశాలు పెద్దగా లేకపోవడంతో సులభంగా నటించారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా కుదిరింది. కానీ, పరమ రొటీన్ సన్నివేశాల్లో ఇద్దరూ ఏం చెయ్యలేక చేతులు ఎత్తేయాల్సి వచ్చింది. పోసాని కృష్ణమురళి, వీకే నరేష్ వంటి సీనియర్ యాక్టర్లు కూడా తమ శక్తి మేరకు సన్నివేశాలను నిలబెట్టడానికి ప్రయత్నించారు. కానీ, రొటీన్ సన్నివేశాలు వాళ్ళకు కొన్నిసార్లు ఆ చాన్సు ఇవ్వలేదు. సప్తగిరి, మధునందన్, సత్యం రాజేష్, స్వామి రారా సత్య తదితరులు పాత్రలకు తగ్గట్టు చేసుకుంటూ వెళ్ళారు. వాణీ విశ్వనాథ్, హెబ్బా పటేల్ పాత్రలు కూడా గొప్పగా లేవు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు ఎంచుకున్న కథలో కొత్తదనం లేదు. కొత్తదనం లేకపోతే పోయింది. గతంలో తీసిన సినిమాలను తిప్పి తీసినట్టు ప్రేక్షకులకు అనిపిస్తే అసలుకే మోసం వస్తుంది. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. రొటీన్ స్టోరీ సినిమాకి మెయిన్ మైనస్ అయితే, అంతకన్నా రొటీన్ కామెడీ సన్నివేశాలతో తియ్యడం వలన ప్రేక్షకులకు విసుగు వస్తుంది.

‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా విజయ్ కుమార్ కొండాకి విజయాన్ని అందిస్తే, తరవాత తీసిన ‘ఒక లైలా కోసం’ మోస్తరు విజయాన్ని అందించింది. ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమా చూస్తున్నంతసేపూ ఆ రెండు సినిమాలు గుర్తుకు వస్తాయి. డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా మూడు సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటంటే… హీరోకి హీరోయిన్‌ ఐడెంటిటీనో, హీరోయిన్‌కి హీరో ఐడెంటిటీనో తెలియకపోవడం. అంతకు మించి ‘ఒరేయ్ బుజ్జిగా’ గురించి చెప్తే అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది. యాక్చువల్లీ… సినిమాలో ట్విస్ట్ ఊహించడం ప్రేక్షకులకు పెద్ద కష్టం ఏమీ కాదు. సినిమా కథే ఐదేళ్ల క్రితం సినిమాలను తలపిస్తే సన్నివేశాలు అంతకు ముందు వచ్చిన సినిమాలను తలపిస్తాయి. డైలాగులు నవ్వించకపోగా చాలా సన్నివేశాల్లో వినిగిస్తాయి. ఎమోషన్స్ కూడా ఎక్కడా పండలేదు. పాటలు కొంతవరకు పర్వాలేదు. ఎడిటింగ్ మాత్రం బాలేదు. ఈజీగా అరగంట సినిమాను కత్తిరించవచ్చు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు ఓకే.

విశ్లేషణ: లాజిక్కులు, కథా కమామీషు వంటివి పక్కన పెట్టేసినా సరే… టీవీల్లోని కామెడీ షోల్లో ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాలో కంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది. కామెడీ కొన్ని సన్నివేశాల్లో వర్కవుట్ అయినప్పటికీ దాని కోసం రెండున్నర గంటలు టైమ్ స్పెండ్ చెయ్యాలంటే ఒకటికి రెండున్నరసార్లు ఆలోచించుకోవాలి.

రేటింగ్: 2/5

ప్లాట్ ఫామ్ : ఆహా

Click Here To Read in ENGLISH

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hebah Patel
  • #Malvika Nair
  • #Orey Bujjiga Movie
  • #Raj Tarun

Also Read

Thammudu Collections: 26 ఏళ్ళ ‘తమ్ముడు’.. ఫైనల్  కలెక్షన్స్ ఇవే!

Thammudu Collections: 26 ఏళ్ళ ‘తమ్ముడు’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Kanchana Collections: 14 ఏళ్ళ ‘కాంచన’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Kanchana Collections: 14 ఏళ్ళ ‘కాంచన’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Bhagyashri Borse: ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీకి టెస్టింగ్ టైం..!

Bhagyashri Borse: ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీకి టెస్టింగ్ టైం..!

Ravi Teja: రవితేజపై ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Ravi Teja: రవితేజపై ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Lokesh Kanagaraj, Nagarjuna: నాగార్జున గురించి దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Lokesh Kanagaraj, Nagarjuna: నాగార్జున గురించి దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Genelia Interview: నా సినిమాలు చూసుకుని నేనే బాధపడే నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదు – జెనీలియా దేశ్ముఖ్

Genelia Interview: నా సినిమాలు చూసుకుని నేనే బాధపడే నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదు – జెనీలియా దేశ్ముఖ్

related news

Oh Bhama Ayyo Rama Review in Telugu: ఓ భామ అయ్యో రామా సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Bhama Ayyo Rama Review in Telugu: ఓ భామ అయ్యో రామా సినిమా రివ్యూ & రేటింగ్!

Virgin Boys Review in Telugu: వర్జిన్ బాయ్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Virgin Boys Review in Telugu: వర్జిన్ బాయ్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

The 100 Review in Telugu: ది 100 సినిమా రివ్యూ & రేటింగ్!

The 100 Review in Telugu: ది 100 సినిమా రివ్యూ & రేటింగ్!

Solo Boy Review in Telugu: సోలో బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Solo Boy Review in Telugu: సోలో బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

Thammudu Review in Telugu: తమ్ముడు సినిమా రివ్యూ & రేటింగ్!

Thammudu Review in Telugu: తమ్ముడు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Thammudu Collections: 26 ఏళ్ళ ‘తమ్ముడు’.. ఫైనల్  కలెక్షన్స్ ఇవే!

Thammudu Collections: 26 ఏళ్ళ ‘తమ్ముడు’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

53 mins ago
Kanchana Collections: 14 ఏళ్ళ ‘కాంచన’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Kanchana Collections: 14 ఏళ్ళ ‘కాంచన’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

4 hours ago
Bhagyashri Borse: ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీకి టెస్టింగ్ టైం..!

Bhagyashri Borse: ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీకి టెస్టింగ్ టైం..!

4 hours ago
Ravi Teja: రవితేజపై ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Ravi Teja: రవితేజపై ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

4 hours ago
Lokesh Kanagaraj, Nagarjuna: నాగార్జున గురించి దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Lokesh Kanagaraj, Nagarjuna: నాగార్జున గురించి దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

5 hours ago

latest news

The 100 Movie: ‘ది 100’ విషయంలో తప్పు ఎక్కడ జరిగింది.. సాగర్ కరెక్ట్ చేసుకోవాల్సిందే!

The 100 Movie: ‘ది 100’ విషయంలో తప్పు ఎక్కడ జరిగింది.. సాగర్ కరెక్ట్ చేసుకోవాల్సిందే!

17 mins ago
Nagarjuna: నాగార్జున అసలైన గ్లామర్ సీక్రెట్ అదే..అలా చేయడం మన వల్ల కాదు లెండి..!

Nagarjuna: నాగార్జున అసలైన గ్లామర్ సీక్రెట్ అదే..అలా చేయడం మన వల్ల కాదు లెండి..!

4 hours ago
Pa Ranjith: స్టంట్‌ మ్యాన్‌ మృతి.. ఎట్టకేలకు స్పందించిన పా.రంజిత్‌!

Pa Ranjith: స్టంట్‌ మ్యాన్‌ మృతి.. ఎట్టకేలకు స్పందించిన పా.రంజిత్‌!

4 hours ago
విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన మరో నటి.. షాకింగ్ ఇది!

విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన మరో నటి.. షాకింగ్ ఇది!

4 hours ago
KRamp: మనోళ్లే ఇలాంటి టైటిల్స్ పెడుతుంటే.. డబ్బింగ్ సినిమాలకు మంచి పేర్లు ఎలా ఉంటాయి?

KRamp: మనోళ్లే ఇలాంటి టైటిల్స్ పెడుతుంటే.. డబ్బింగ్ సినిమాలకు మంచి పేర్లు ఎలా ఉంటాయి?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version