ఇటీవల ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా సెట్స్ నుండి ఓ ఫోటో బయటకు వచ్చింది. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఇటీవల నిర్వహించారు. ప్రభాస్ నాన్ స్టాప్ గా షూటింగ్లో పాల్గొన్నాడు. ఆ టైంలో ఆన్ లొకేషన్ పిక్ అలాగే చిన్న వీడియో బైట్ ఒకటి లీక్ అయ్యింది.పోలీస్ డ్రెస్ లో పవర్ఫుల్లో ప్రభాస్ కనిపించాడు. మొన్నామధ్య కొంచెం బొద్దుగా కనిపించిన డార్లింగ్ ఇప్పుడు ‘రాజాసాబ్’ కోసం మళ్ళీ స్లిమ్ అయ్యాడు. ‘స్పిరిట్’ కోసం ఇంకాస్త స్లిమ్ అయ్యాడు.
పోలీస్ రోల్ కాబట్టి.. మరింత ఫిట్ గా కనిపించాలి కాబట్టి.. ప్రభాస్ జిమ్లో వర్కౌట్లు చేసి తగ్గి ఉండొచ్చు. ఇక లీక్డ్ వీడియోలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో దేని గురించో సీరియస్ గా ముచ్చటిస్తున్నట్టు కనిపించాడు.

ఇదిలా ఉంటే..3 రోజుల క్రితం ప్రభాస్ జపాన్ వెళ్లినట్టు తెలుస్తుంది. ‘బాహుబలి ది ఎపిక్’ ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ అక్కడి ఫ్యాన్స్ ని విజిట్ చేసేందుకు వెళ్లారు. గత నెలలో ‘బాహుబలి’ ‘బాహుబలి 2’ని … ‘బాహుబలి ది ఎపిక్’ గా చేసి రిలీజ్ చేశారు రాజమౌళి. రీ- రిలీజ్లో కూడా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లు పైగా వసూళ్లు రాబట్టి చరిత్ర సృష్టించింది.
టాలీవుడ్లో ఇప్పటివరకు రిలీజ్ అయిన రీ- రిలీజ్ సినిమాల్లో ఆల్ టైం రికార్డులు సృష్టించింది. జపాన్లో కూడా ‘బాహుబలి ది ఎపిక్’ ను రీ రిలీజ్ చేయబోతున్నారు. అందుకే ప్రభాస్ అక్కడికి వెళ్ళాడు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.అందులో ప్రభాస్ కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ లుక్ స్పిరిట్ కోసమే అయ్యుండొచ్చు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.
