Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Filmy Focus » Reviews » Ori Devuda Review: ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!

Ori Devuda Review: ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!

  • October 21, 2022 / 01:45 PM ISTByFilmy Focus
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Ori Devuda Review: ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • విశ్వక్ సేన్, వెంకటేష్ (Hero)
  • మిథాలీ పాలేకర్, ఆశా భట్ (Heroine)
  • వెంకటేష్ కాకమాను తదితరులు (Cast)
  • అశ్వత్ మారిముత్తు (Director)
  • ప్రసాద్ వి.పొట్లూరి - దిల్ రాజు (Producer)
  • లియోన్ జేమ్స్ (Music)
  • విధు అయ్యన్న (Cinematography)
  • Release Date : అక్టోబర్ 21, 2022
  • పివిపి సినిమా (Banner)

తమిళంలో ఘన విజయం సొంతం చేసుకున్న “ఓ మై కడవులే” చిత్రానికి రీమేక్ గా రూపొందిన తెలుగు చిత్రం “ఓరి దేవుడా”. విశ్వక్ సేన్, వెంకటేష్, మిథాలీ పాలేకర్, ఆశా భట్ కీలకపాత్రలు పోషించగా.. తమిళ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన అశ్వత్ తెలుగు వెర్షన్ కు కూడా దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం విశేషం. మరి ఈ రీమేక్ తెలుగు ఆడియన్స్ ను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ: తాను ఇష్టపడిన అమ్మాయిని కాక.. తనను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకొని.. అర్ధం కాని ఇబ్బందులు, బాధలతో జీవితాన్ని సాగిస్తుంటాడు అర్జున్ (విశ్వక్ సేన్). ఇదేం జీవితంరా బాబు అని బాధపడుతున్న తరుణంలో అతనికి తన జీవితాన్ని మళ్ళీ కొత్తగా మొదలెట్టే అవకాశం లభిస్తుంది. ఆ అవకాశాన్ని అర్జున్ ఎలా వినియోగించుకున్నాడు? రెండో అవకాశంతోనైనా ఆనందంగా ఉండగలిగాడా? అనేది “ఓరి దేవుడా” కథాంశం.

నటీనటుల పనితీరు: అర్జున్ గా విశ్వక్ సేన్ నటన బాగుంది. తనదైన శైలి బాడీ లాంగ్వేజ్ తోపాటు.. కాస్త సబ్టల్ బిహేవియర్ తో కొత్తగా కనిపించాడు. అలాగే ఎమోషనల్ సీన్స్ లోనూ అలరించాడు. నటుడిగా విశ్వక్ సేన్ కు మంచి ప్లస్ అయిన సినిమా ఇది. బాలీవుడ్ బ్యూటీ మిథాలీ పాలేకర్ క్యూట్ గా ఆకట్టుకుంది. లిప్ సింక్ విషయంలో కాస్త ఇబ్బందిపడినా, హావభావాలతో మాత్రం యువతకు విశేషంగా ఆకట్టుకుంది.

ఆమె క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ కు జనాలు ఫిదా అవ్వాల్సిందే. ఆశా భట్ స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. నటనతోనూ ఆకట్టుకుంది. దేవుడిగా వెంకీ మామ మాత్రం అదరగొట్టేశాడు. ఆయన స్క్రీన్ ప్రెజన్స్ & కామెడీ టైమింగ్ కి ఆడియన్స్ కడుపుబ్బ నవ్వాల్సిందే. వెంకీకి మంచి సపోర్ట్ ఇచ్చాడు రాహుల్ రామకృష్ణ.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు అశ్వత్ తమిళ వెర్షన్ లో మిస్ అయిన అన్నీ తెలుగు వెర్షన్ లో యాడ్ చేశాడు. అందువల్ల ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్ అయినప్పటికీ.. ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. విశ్వక్ సేన్ – మిథాలీ కెమిస్ట్రీ & విశ్వక్ సేన్ – ఆశా భట్ కామిబినేషన్ లో ఫన్ బాగా జనరేట్ అయ్యింది. సంగీతం, ఛాయాగ్రహణం & ప్రొడక్షన్ డిజైన్ బాగున్నాయి. అయితే.. వీళ్ళందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేసిన వ్యక్తి తరుణ్ భాస్కర్.

తనదైన శైలి సంభాషణలతో హిలేరియస్ ఫన్ క్రియేట్ చేశాడు. ముఖ్యంగా విశ్వక్ సేన్ – వెంకీ కాంబినేషన్ సీన్స్ లో డైలాగ్స్ బాగా పేలాయి, అలాగే ఎమోషనల్ సీన్స్ లో కూడా ప్రీచింగ్ కు తావు లేకుండా.. సింగిల్ లైన్ డైలాగులతో ఎమోషన్ ను ఎలివేట్ చేశాడు.

విశ్లేషణ: ఒరిజినల్ చూసినప్పటికీ.. బోర్ కొట్టించకుండా ఆడియన్స్ ను అలరించే చిత్రం “ఓరి దేవుడా”. అయితే.. ఎమోషనల్ కనెక్టివిటీ కాస్త మిస్ అవ్వడంతో, పాత్రధారులకు కానీ సినిమాకి కానీ జనాలు ఎక్కువ కనెక్ట్ అవ్వలేదు. ఆ ఒక్క మైనస్ ను పట్టించుకోకపోతే.. హ్యాపీగా ఒకసారి చూడదగ్గ సినిమాగా “ఓరి దేవుడా” నిలుస్తుంది.

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashwath Marimuthu
  • #Mithila Palkar
  • #Ori Devuda
  • #Venkatesh
  • #Vishwak Sen

Reviews

Nari Nari Naduma Murari Review in Telugu: నారీ నారీ నడుమ మురారి సినిమా రివ్యూ & రేటింగ్!

Nari Nari Naduma Murari Review in Telugu: నారీ నారీ నడుమ మురారి సినిమా రివ్యూ & రేటింగ్!

Anaganaga Oka Raju Review in Telugu: అనగనగా ఒక రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Anaganaga Oka Raju Review in Telugu: అనగనగా ఒక రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Bhartha Mahasayulaku Wignyapthi Review in Telugu: భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhartha Mahasayulaku Wignyapthi Review in Telugu: భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Mana ShankaraVaraPrasad Garu Review in Telugu: మన శంకరవరప్రసాద్ గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Mana ShankaraVaraPrasad Garu Review in Telugu: మన శంకరవరప్రసాద్ గారు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mana ShankaraVaraprasad Garu Collections: అదిరిపోయిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Mana ShankaraVaraprasad Garu Collections: అదిరిపోయిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Mana ShankaraVaraprasad Garu: ‘అఖండ 2’ రికార్డులు బ్రేక్ చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu: ‘అఖండ 2’ రికార్డులు బ్రేక్ చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu: ఈ మైనస్ పాయింట్స్ లేకపోతే ‘మనశంకర్ వరప్రసాద్ గారు’ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చి ఉండేది కదా

Mana ShankaraVaraprasad Garu: ఈ మైనస్ పాయింట్స్ లేకపోతే ‘మనశంకర్ వరప్రసాద్ గారు’ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చి ఉండేది కదా

Mana ShankaraVaraPrasad Garu Twitter Review: మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో చిరు కంబ్యాక్ ఇచ్చినట్టేనా? ట్విట్టర్ టాక్ ఇదే!

Mana ShankaraVaraPrasad Garu Twitter Review: మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో చిరు కంబ్యాక్ ఇచ్చినట్టేనా? ట్విట్టర్ టాక్ ఇదే!

Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

trending news

Nari Nari Naduma Murari Review in Telugu: నారీ నారీ నడుమ మురారి సినిమా రివ్యూ & రేటింగ్!

Nari Nari Naduma Murari Review in Telugu: నారీ నారీ నడుమ మురారి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓపెనింగ్స్

Bhartha Mahasayulaku Wignyapthi Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓపెనింగ్స్

20 hours ago
Mana ShankaraVaraprasad Garu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

20 hours ago
The RajaSaab: 5వ రోజు మరింత డౌన్ అయిపోయిన ‘ది రాజాసాబ్’..ఇక పండుగ హాలిడేస్ పైనే ఆశలు

The RajaSaab: 5వ రోజు మరింత డౌన్ అయిపోయిన ‘ది రాజాసాబ్’..ఇక పండుగ హాలిడేస్ పైనే ఆశలు

22 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago

latest news

Mana Shankar Vara Prasad Garu: మొదలైన థియేటర్ల పంచాయితీ.. ప్రీమియర్ల తరహాలో చిరు రెగ్యులర్‌ షోలు..

Mana Shankar Vara Prasad Garu: మొదలైన థియేటర్ల పంచాయితీ.. ప్రీమియర్ల తరహాలో చిరు రెగ్యులర్‌ షోలు..

46 mins ago
Radhika Apte: దీపిక ఇలా మాట్లాడితే బ్యాడ్‌ చేశారు.. ఇప్పుడు రాధిక అదే మాటలు అంటోంది

Radhika Apte: దీపిక ఇలా మాట్లాడితే బ్యాడ్‌ చేశారు.. ఇప్పుడు రాధిక అదే మాటలు అంటోంది

58 mins ago
Karthikeya: తారక్‌ బిజీ.. బన్నీ కూడా బిజీ.. మరి త్రివిక్రమ్‌ సినిమా చేసేదెవరు?

Karthikeya: తారక్‌ బిజీ.. బన్నీ కూడా బిజీ.. మరి త్రివిక్రమ్‌ సినిమా చేసేదెవరు?

1 hour ago
Rajasaab: అందరూ వదిలేసిన అనాధ ‘రాజా సాబ్‌’.. ప్రచారం ఊసెత్తని టీమ్‌.. ఏమైంది?

Rajasaab: అందరూ వదిలేసిన అనాధ ‘రాజా సాబ్‌’.. ప్రచారం ఊసెత్తని టీమ్‌.. ఏమైంది?

1 hour ago
Venu Yeldandi : ఎట్టకేలకు ‘ఎల్లమ్మ’ నుంచి మొదటి  అప్డేట్ వచ్చేస్తోందిగా..!

Venu Yeldandi : ఎట్టకేలకు ‘ఎల్లమ్మ’ నుంచి మొదటి అప్డేట్ వచ్చేస్తోందిగా..!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version