యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో యావరేజ్ గా నిలిచిన సినిమాలలో అల్లరి రాముడు సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. బి.గోపాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్ పై చంటి అడ్డాల ఈ సినిమాను నిర్మించారు. నిర్మాతకు ఊహించని స్థాయిలో లాభాలను అందించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఆర్తి అగర్వాల్, గజాల ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఇంద్ర సినిమాకు 5 రోజుల ముందు అల్లరి రాముడు విడుదలైందని ఆయన అన్నారు. అల్లరి రాముడు మొదట రాసిన స్క్రిప్ట్ ను జూనియర్ ఎన్టీఆర్ చూసి అక్షరం మార్చకుండా ఇలాగే సినిమా తీయండని చెప్పారని పరుచూరి తెలిపారు. ఫస్టాఫ్ అలాగే తీశారని సెకండాఫ్ మాత్రం అలా తీయలేదని పరుచూరి గోపాలకృష్ణ కామెంట్లు చేశారు. సెకండాఫ్ లో సోది పాత్రలు డెవలప్ అయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. ఆ సినిమా సెకండాఫ్ ఆర్డర్ మారిపోయిందని ఆయన కామెంట్లు చేశారు.
ఆ సమయంలో నేను షూటింగ్ కు వెళ్లలేని పరిస్థితి ఉందని ఆయన చెప్పుకొచ్చారు. 175 రోజులు ఆడాల్సిన ఈ సినిమా 100 రోజులు ఆడాల్సిన పరిస్థితి వచ్చిందని పరుచూరి అన్నారు. దుర్యోధనుడి మోనో యాక్షన్ సీన్ ఈ సినిమాలో ఉండాలని ఆ సీన్ మిస్సైందని పరుచూరి తెలిపారు.
అల్లరి రాముడు, ఇంద్ర ఐదు రోజుల గ్యాప్ లో విడుదల కావడం మమ్మల్ని బాధ పెట్టిందని ఆయన అన్నారు. తారక్ ను మా బిడ్డలా చూస్తామని పరుచూరి తెలిపారు. ప్రతి సినిమా ఆడాలనే రాస్తామని అన్నం తినకుండా నేను రాసిన సినిమాలు కూడా ఉన్నాయని పరుచూరి గోపాలకృష్ణ కామెంట్లు చేశారు. పరుచూరి గోపాలకృష్ణ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.