సినిమా వాళ్ల జీవితాలు తెరమీద కనిపించేంతా కలర్‌ఫుల్‌గా ఏమీ ఉండవు.. ముఖాన మేకప్ వేస్తేనే కడుపు నిండుతుంది.. పేకప్ అనే సౌండ్ విన్నాకే పేమెంట్ వస్తుందనే భరోసా ఉంటుంది.. బిగ్ స్టార్స్, క్యారెక్టర్ ఆర్టిస్టుల లగ్జరీ లైఫ్ వేరు కానీ.. చిన్నా చితకా పాత్రలు వేసే వాళ్లవి మాత్రం చితికిపోయే బ్రతుకులే.. షూటింగ్ ఉన్నరోజు సంతోషంగా ఉంటారు.. లేని రోజు పస్తులుంటారు.. కృష్ణానగర్, ఫిలింనగర్‌లో ఇలాంటి జీవితాలు, నిజ జీవిత గాధలు బోలెడన్ని తారసపడతాయి..
పాపులర్, సీనియర్ నటి పావలా శ్యామలా ప్రస్తుతం దయనీయ స్థితిలో ఉన్నారు.. పెద్ద వయసు.. పైగా అనారోగ్యంతో అనాథాశ్రమంలో తన కూతురితో కలిసి కాలం గడుపుతున్నారామె.. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కిచ్చిన ఇంటర్వూలో తన గోడు వెళ్లబోసుకున్నారు శ్యామల.. ఆమె నటించిన సినిమాల్లోని కామెడీ సీన్స్, ఆమె ఫొటోతో చేసే ఫన్నీ మీమ్స్ అందర్నీ ఆకట్టుకుంటాయి.. అలాంటామె జీవితంలో ఇంతటి విషాదం ఉందని ఎవరూ అనుకోరు..
‘‘ఎప్పటినుండో మా అసోసియేషన్‌లో మెంబర్ షిప్ కార్డ్ తీసుకుందామనుకుంటే కుదరలేదు.. తీరా అది లక్ష రూపాయలైపోయింది..చిరంజీవి లక్ష కట్టి మరీ మెంబర్ షిప్ ఇప్పించారు. తర్వాత నా కూతురికి ఆరోగ్యం పాడైతే మరో 2 లక్షలు ఆర్థిక సాయం చేశారు.. ఆ డబ్బులతోనే ఇప్పటిదాకా నెట్టుకొచ్చాం..లాంటి బతుకుదెరువు లేదు..ఆత్మహత్య చేసుకోవడం తప్ప మాకు వేరే దారి లేదు..ఇంత విషం కొని తెచ్చుకుని తాగి చావడానికి కూడా శక్తి లేని స్థితిలో ఉన్నాం..మంచు విష్ణు మా ప్రెసిడెంట్ అయ్యాక నన్ను చూసుకోవడానికి ఒక అమ్మాయిని పెట్టారు..
ఆమె మధ్యలోనే సంబంధం లేదని వదిలేసి వెళ్లిపోయింది..ఆ తర్వాత నేను బతికున్నానా, లేదా? అని కూడా ఎవరూ పట్టించుకోలేదు సరికదా..కనీసం చూడ్డానికి కూడా ఎవరూ రాలేదు’’ అంటూ విలపించారు.. ఆమె పరిస్థితి తెలిసి వీడియో చూసిన వారు కూడా కంటతడి పెడుతున్నారు.. 300 లకు పైగా సినిమాల్లో నటించిన సీనియర్ నటి పావలా శ్యామలకి సినీ పరిశ్రమ,పెద్దలు సాయం చేయాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది..