పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడానికి ముందు నుంచీ కూడా ఆయన మీద ఉన్న ప్రధానమైన నింద “మూడు పెళ్లిళ్లు చేసుకొన్నాడు” అనే. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగడంతో అందరూ సందు దొరికినప్పుడల్లా “మూడు పెళ్లిళ్లు చేసుకొన్న నువ్వా చెప్పేది నాకు” అనడం సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా మొన్నామధ్య జగన్ “పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకొన్నాడూ” అంటూ ఇచ్చిన స్టేట్ మెంట్ అయిన పెద్ద చర్చకు దారి తీసింది. అప్పటివరకూ ఎవరు తన వ్యక్తిగత జీవితం మీద నిందలు వేసినా అనవసరంగా మాట్లాడినా సైలెంట్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ఈమధ్యకాలంలో ఆ నిందలు, కామెంట్లు మరీ ఎక్కువవుతుండడంతో ఒక్కసారిగా బరస్ట్ అయ్యాడు.
“నేనేమీ సరదాగా తిరగడం కోసమే, ఇంకో అవసరం కోసమో మూడు పెళ్లిళ్లు చేసుకోలేదు. మొదటి పెళ్లి నా ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. రేణుతో విబేధాలు ఏమీ రాలేదు, కానీ ఇద్దరికీ సెట్ అవ్వలేదు అనిపించింది. ఇక అన్నా నన్ను అర్ధం చేసుకొన్న విధానం నచ్చింది. అందుకే నా ఖర్మ కాలి మూడు పెళ్లిళ్లు చేసుకొన్నానే తప్ప బలాదూర్ గా తిరగడం కోసం కాదు” అంటూ కాస్త గట్టిగానే వివరణ ఇచ్చాడు. మరి పవన్ కళ్యాణ్ తన సైడ్ నుంచి స్టేట్ మెంట్ ఇచ్చాడు బాగానే ఉంది కానీ.. భవిష్యత్ లో ఈ తరహాలో మరిన్ని మాటల దాడులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి అప్పుడు ఎలా, ఎంత చాకచక్యంగా మెచ్యూర్డ్ గా వ్యవహరిస్తాడు అనేది చూడాలి.