ఎంత పెద్ద ప్రయాణం అయినా ఒక్క అడుగుతోనే ప్రారంభవుతుంది.. జీవితంలో ఆ ఫస్ట్ స్టెప్‌కి ఉన్న ప్రాధాన్యతే వేరు.. ఫస్ట్ బర్త్‌డే, తొలిసారి స్కూల్ కెళ్లిన మొదటి రోజు.. కాలేజీ, జాబ్, ఫస్ట్ శాలరీ.. ఇలా ఫస్ట్ అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది.. సినిమా ఫీల్డ్‌లో అయితే ఇలాంటి సెంటిమెంట్స్ చాలా ఎక్కువ.. నటీనటుల కెరీర్‌లో తెరపై కనిపించిన తొలి చిత్రం నుండి ప్రతీది ప్రత్యేకమే.. అలాంటి స్పెషాలిటీ, రేర్ ఫీట్, రికార్డ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరికి మాత్రమే సాధ్యమైంది.. అవేంటో చూద్దాం..
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్.. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, స్టార్ డమ్‌తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు.. ఇప్పుడు జనసేనాని రేంజ్ ఏంటనేది కొత్తగా చెప్పక్కర్లేదు.. రోజుకి అక్షరాలా రెండు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారాయన.. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా మేనమామ మెగాస్టార్ స్ఫూర్తితో.. ‘డాడీ’ సినిమాలో కాసేపు కనిపించి..
‘గంగోత్రి’ తో హీరోగా మారాడు.. తన స్టైల్ యాక్టింగ్, డ్యాన్స్‌తో స్టైలిష్ స్టార్‌గా ఎదిగాడు.. ‘పుష్ప’ తో పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో తెలిసిందే.. ప్రస్తుతం ఐకాన్ స్టార్ చేస్తున్న ‘పుష్ప : ది రూల్’ కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోంది.. ఇక ఈ మెగా మామా అల్లుళ్ల పేరిట ఉన్న అరుదైన రికార్డ్ ఏంటంటే.. ఇద్దరు నటించిన ఏడు సినిమాలు కూడా వరుసగా వంద రోజులు ఆడాయి..
‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’ నుండి ‘ఖుషి’ వరకు పవన్.. ‘గంగోత్రి’ నుండి ‘ఆర్య 2’ వరకు బన్నీ.. ఇలా ఇద్దరివీ ఏకంగా ఏడు సినిమాలు శత దినోత్సవం జరుపుకున్నాయి.. ఇలాంటి అరుదైన ఘనత సాధించింది వీళ్లిద్దరు మాత్రమే.. టాలీవుడ్ హిస్టరీలో ఇది ‘‘పర్మినెంట్ రికార్డ్’’..
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?