2020 ప్రారంభంలోనే అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో మూవీతో భారీ హిట్ అందుకున్నారు. 150కోట్లకు పైగా వరల్డ్ వైడ్ షేర్ సాధించిన ఈ చిత్రం టాలీవుడ్ ఆల్ టైం హైయెస్ట్ గ్రాస్సింగ్ రాబట్టిన చిత్రాలలో 3వ స్థానంలో కొనసాగుతుంది. అంటే ప్రస్తుతానికి నాన్ బాహుబలి రికార్డు బన్నీదే. 2020 హైయెస్ట్ గ్రాస్సింగ్ సాధించిన చిత్రంగా కూడా అల వైకుంఠపురంలో ఉంది. ప్రస్తుతానికి బన్నీ పేరిట ఉన్న ఈ రికార్డు సేఫ్ అని చెప్పాలి. ఒకవేళ రాజమౌళి భారీ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ అనుకున్న ప్రకారం జులై 30న విడుదలైనట్లైతే బన్నీ రికార్డ్ ఖచ్చితంగా బ్రేక్ అయ్యేది.కానీ ఆర్ ఆర్ ఆర్ వచ్చే ఏడాది జనవరి 8కి వాయిదాపడింది. ఐతే ఈ ఏడాది బన్నీ రికార్డు చెరిపివేసే సత్తా ఇద్దరు హీరోలకు మాత్రమే ఉంది. ఒకటి ప్రభాస్ రెండు పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీగా తెరకెక్కుతున్న పింక్ రీమేక్ అల వైకుంఠపురంలో రికార్డ్స్ చెరిపివేసే అవకాశం కలదు. పవన్ నుండి రెండున్నరేళ్ల తరువాత వస్తున్నమూవీ కావడంతో దీనికి భారీ ఓపెనింగ్స్ దక్కే అవకాశం కలదు. ఇక హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో బన్నీ నాన్ బాహుబలి రికార్డ్ చెరిగిపోయే అవకాశం కలదు. అలాగే పవన్ క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న పీరియడ్ మూవీ కూడా చిత్రీకరణ జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ మూవీ కూడా ఈ ఏడాదే విడుదల అయ్యే అవకాశం కలదు. సోషల్ మెస్సేజ్ తో తెరకెక్కుతున్న పింక్ రీమేక్ భారీ విజయం అందుకోకపోయినా… క్రిష్ మూవీ 2020లోనే విడుదల అయితే అల వైకుంఠపురంలో రికార్డ్స్ పవన్ చెరిపివేయడం ఖాయం అని చెప్పొచ్చు.
ఇక ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ లవ్ డ్రామా కూడా అల వైకుంఠపురంలో చిత్ర రికార్డ్స్ క్రాస్ చేసే అవకాశం కలదు. 150కోట్లకు పైగా బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ మూవీ విడుదల కానుంది. ప్రభాస్ కి ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను బట్టి చూస్తే ఆయనకు బన్నీ సెట్ చేసిన నాన్ బాహుబలి రికార్డ్స్ అందుకోవడం పెద్ద సమస్యేమీ కాదు. ఇక మహేష్-వంశీ పైడిపల్లి మూవీ ఈ ఏడాది విదులయ్యే అవకాశం లేని క్రమంలో బన్నీ అల వైకుంఠపురంలో చిత్రంతో క్రియేట్ చేసిన రికార్డ్స్ 2020లో బీట్ చేసే బాధ్యత పవన్ మరియు ప్రభాస్ లదే.