పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండీ 3 ఏళ్ళ తరువాత వచ్చిన చిత్రం ‘వకీల్ సాబ్’. గత వారం విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటున్నప్పటికీ.. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎదురీదుతూ మంచి కల్లెక్షన్లనే నమోదు చేస్తుందిస్తోంది. నిజానికి 2013 లో పవన్ కళ్యాణ్ నుండీ వచ్చిన ఇండస్ట్రీ హిట్ ‘అత్తారింటికి దారేది’ తరువాత ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోయాడు పవన్ కళ్యాణ్.
అటు తరువాత వచ్చిన ‘గోపాల గోపాల’ యావరేజ్ కాగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ‘కాటమరాయుడు’ ‘అజ్ఞాతవాసి’ వంటి సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి. దాంతో అవేమీ కూడా ‘అత్తారింటికి దారేది’ కలెక్షన్లను అధిగమించలేక పోయాయి. అయితే ‘వకీల్ సాబ్’ చిత్రం 6వ రోజునే ‘అత్తారింటికి దారేది’ కలెక్షన్లను అధిగమించింది. 2013 లో విడుదలైన ‘అత్తారింటికి దారేది’ చిత్రం ఫుల్ రన్ ముగిసేసరికి రూ.75 కోట్ల షేర్ ను రాబట్టి.. నెంబర్ వన్ మూవీ అనిపించుకుంది.
ఇన్నాళ్టికి ‘వకీల్ సాబ్’ చిత్రం 6వ రోజునే వరల్డ్ వైడ్ గా 77కోట్ల షేర్ ను రాబట్టి.. ఆ రికార్డుని బ్రేక్ చేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యథిక కలెక్షన్లు రాబట్టిన మూవీగా ఇప్పుడు ‘వకీల్ సాబ్’ నిలిచింది. మరి రానున్న రోజుల్లో కూడా బాగా కలెక్ట్ చేసి 100 కోట్ల షేర్ ను నమోదు చేస్తుందో లేదో చూడాలి. టికెట్ రేట్ల హైక్ కు ఏపి ప్రభుత్వం కనుక పర్మిషన్ ఇచ్చి ఉంటే మాత్రం.. కచ్చితంగా ‘వకీల్ సాబ్’ చిత్రం రూ.150 కోట్ల షేర్ ను వసూల్ చేసి ఉండేదేమో అనడంలో అతిశయోక్తి లేదు.