స్టార్ హీరో, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గడిచిన ఆరు నెలల నుంచి పూర్తిస్థాయిలో రాజకీయాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. తాజాగా ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రజల కొరకు తమ జీవితాన్ని ధారబోసే శాస్త్రవేత్తలే స్పూర్తి ప్రధాతలని ఆయన అన్నారు. తన దృష్టిలో రియల్ హీరోలు శాస్త్రవేత్తలేనని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం. సినిమాలకు అయ్యే ఖర్చు కంటే తక్కువ మొత్తంతో ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారని నా దృష్టిలో ఈ శాస్త్రవేత్తలే రియల్ హీరోలని ఆయన పేర్కొన్నారు.
Pawan Kalyan
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో జాతీయ అంతరిక్ష ఉత్సవాలు జరగగా ఆ ఉత్సవాలలో పవన్ కళ్యాణ్ పాల్గొనడం జరిగింది. పవన్ కళ్యాణ్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. షార్ డైరెక్టర్ రాజరాజన్ పవన్ కు చంద్రయాన్3 రాకెట్ ప్రయోగ నమూనాను బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో రాకెట్ ప్రయోగాలు చేసే శాస్త్రవేత్తలు కనిపించని దేవుళ్లు అని పవన్ పేర్కొన్నారు.
నేటితరం యువత ప్రతి చిన్న విషయానికి కుంగిపోతున్నారని అలాంటి వాళ్లకు శాస్త్రవేత్తలు స్పూర్తి ప్రదాతలని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. శ్రీహరికోట సందర్శనతో నా చిన్ననాటి కోరిక నెరవేరిందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ శాస్త్రవేత్తలకు అండగా ఉన్న నేపథ్యంలో ప్రయోగాలు విజయవంతం అవుతాయని ఆయన తెలిపారు.
పవన్ కళ్యాణ్ శాస్త్రవేత్తల గురించి గొప్పగా చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ త్వరలో రెగ్యులర్ షూటింగ్స్ కు సంబంధించి కీలక అప్ డేట్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను వేగంగా పూర్తి చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.