అభిమాన హీరో నుండి మూడు నెలలకో, నాలుగు నెలలకో ఓ సినిమా వస్తే ఎవరు కాదంటారు చెప్పండి. అలా వరుసగా సినిమాలు చేస్తే చూడాలి అని కోరుకుంటారు కూడా. అయితే ఎక్కడో చిన్న భయం ఉంటుంది. అదే అన్ని సినిమాల్లో ఒకేలా కనిపిస్తాడా, వైవిధ్యం లోపిస్తుందా అని. కథలు, కాలాల్లో డిఫరెన్స్ ఉన్నా.. ఎక్కడో ఎక్స్‌ప్రెషన్స్‌లో, ఎనర్జీలో డిఫరెన్స్ వస్తుందేమో అని భయం ఉంటుంది. అయితే ఆ సినిమాలన్నీ పారలల్‌గా చిత్రీకరణ జరుపుకున్నప్పుడే ఈ సమస్య వస్తుంది.
ఇప్పుడు, ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? పవన్ కల్యాణ్ సినిమాల గురించే. ప్రస్తుతం సెట్స్ మీద పవన్ సినిమాలు నాలుగు ఉన్నాయి. ఒక సినిమా దాదాపు పూర్తయిపోయింది కాబట్టి.. మూడే అని చెప్పొచ్చు. మూడూ మూడు రకాల కథలు, కాలాలు, నేపథ్యాలు. అయితే మూడింటికి పవన్ డేట్స్ ఇచ్చే క్రమంలో వారానికో సెట్‌కి వెళ్తున్నాడు. దీంతో ఇక్కడ, అక్కడ అంటూ అంతా ఒకేలా ఉంటాయా అనే భయం వేస్తోంది.
మొన్నీమధ్య వరకు ‘ఓజీ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న పవన్ కల్యాన్ త్వరలో ‘హరి హర వీరమల్లు’ సినిమా సెట్స్‌లోకి వెళ్తారు అని సమాచారం. దీని కోసం రామోజీ ఫిలింసిటీలో ఓ పెద్ద సెట్ కూడా వేశారట. అందులో పవన్, ఇతరుల మీద ఓ పాట చిత్రీకరణ ఉంటుంది అని చెబుతున్నారు. అయితే ఈ షెడ్యూల్ నాలుగు రోజులే అని సమాచారం. ఆ తర్వాత వెంటనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కొత్త షెడ్యూల్ మొదలవుతుందట.
ఇలా పవన్ వరుసగా సినిమాలు మారుతూ.. వారానికో పాత్రను చేస్తున్నాడు. ఇందాక చెప్పినట్లు ఇది చూడటానికి ఫ్యాన్స్‌కి బాగుంటుందేమో కానీ.. పవన్‌కి కష్టంగా ఉంటుంది అని చెప్పొచ్చు. అయితే తాను అనుకున్నట్లుగా వచ్చే ఎన్నికల్లోపు పవన్ ఆ సినిమాలు పూర్తి చేసేయాలి. అందుకే ఇలా వరుస షెడ్యూల్స్ చేస్తున్నాడు అని సమాచారం. అన్నట్లు ఈ నెలాఖరులో హైదరాబాద్‌లో ‘ఓజీ’ కొత్త షెడ్యూల్ కూడా ఉందట.
కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!
భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!