పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జయాపజయాలతో సంబంధం లేకుండా దర్శకులకు ఛాన్స్ ఇస్తారనే సంగతి తెలిసిందే. పవన్ సినిమాలకు దర్శకత్వం వహిస్తున్న క్రిష్, సుజీత్, సురేందర్ రెడ్డి గత సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలను సొంతం చేసుకోలేదు. ఫామ్ లో లేని డైరెక్టర్లకు పవన్ ఛాన్స్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ రిస్క్ చేస్తున్నా గ్రేట్ అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఫ్లాప్ లో ఉన్న డైరెక్టర్లకు పవన్ ఛాన్స్ ఇస్తుండటంతో దర్శకుల ఎంపికలో పవన్ కళ్యాణ్ నిర్ణయం రైటేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆ డైరెక్టర్లకు హిట్ ఇస్తే పవన్ కళ్యాణ్ కు క్రేజ్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుంది. పవన్ కళ్యాణ్ కథల ఎంపికలో జాగ్రత్త వహించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ డైరెక్టర్ల గత సినిమాలు ఫ్లాపైనా ఈ డైరెక్టర్లు టాలెంట్ ఉన్న దర్శకులు కావడం గమనార్హం. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో కీలక నియోజకవర్గాల్లో తన పార్టీ పోటీ చేసేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారని సమాచారం అందుతోంది.
పవన్ కళ్యాణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు పూర్తి కావాలంటే 2025 వరకు సమయం పడుతుందని తెలుస్తోంది. ప్రతి ఆరు నెలలకు ఒక సినిమాను విడుదల చేసేలా పవన్ కళ్యాణ్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 5 ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఈ నెలలో షూటింగ్ లతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది. కథ అద్భుతంగా ఉంటే పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.